hyderabadupdates.com movies ఇకపై ఉత్త శ్రీలీల కాదు

ఇకపై ఉత్త శ్రీలీల కాదు

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటూ చాలామంది సినీ జనాలు చెబుతుంటారు. ఐతే యాక్టర్ అయ్యాక డాక్టర్ అయిన వాళ్లు మాత్రం అరుదుగానే ఉంటారు. కన్నడనాట స్థిరపడ్డ తెలుగమ్మాయి శ్రీలీల ఈ కోవకే చెందుతుంది. టీనేజీలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టేసిన ఆమె.. కోట్ల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగినా చదువును మాత్రం విడిచిపెట్టలేదు.

అలా అని మొక్కుబడిగా ఏదో ఒక డిగ్రీ కోసం ట్రై చేయకుండా అత్యంత కష్టమైన ఎంబీబీఎస్‌లో చేరింది. తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే చదువును కొనసాగించింది. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసిన విషయం కొన్ని నెలల కిందటే వెల్లడైంది. ఇప్పుడు శ్రీలీల.. అధికారికంగా డిగ్రీ తీసుకుంది. శ్రీలీల తాను చదివిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది.

బహు భాషల్లో కథానాయికగా స్టార్ స్టేటస్ తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తూ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేయడం ద్వారా శ్రీలీల యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అధికారికంగా పట్టా పుచ్చుకుంది కాబట్టి.. ఇకపై సినిమాల్లో తన పేరును ‘డాక్టర్ శ్రీలీల’ అని వేయాలి. కన్నడ సినిమాలతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల.. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే తెలుగులో ఆమె పది సినిమాలకు పైగా చేసింది.

ఇటీవలే శివ కార్తికేయన్ చిత్రం ‘పరాశక్తి’తో తమిళంలోకి అడుగు పెట్టింది శ్రీలీల. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో మళ్లీ ఓ పెద్ద సక్సెస్ కోసం చూస్తున్న ఆమె.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది.

Related Post

బీజేపీ రుణం తీర్చేసుకున్న నితీశ్బీజేపీ రుణం తీర్చేసుకున్న నితీశ్

రాజకీయాల్లో లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని ఫార్ములాలు కొందరికి మినహాయింపులు ఇచ్చేసే పరిస్థితి కాలం ఇస్తూ ఉంటుంది. బీజేపీ లాంటి పార్టీ.. తాను గురి పెట్టిన రాష్ట్రంలో తన భాగస్వామి పార్టీ కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి కూడా

Veteran Malayalam actor and director Sreenivasan passes away at 69 after long battle with illnessVeteran Malayalam actor and director Sreenivasan passes away at 69 after long battle with illness

Trigger warning: This article mentions the death of an individual. The Malayalam film industry has suffered a massive loss today. Ace actor, screenwriter, director, and producer Sreenivasan has tragically passed

రాజమౌళిని మెప్పించిన మందాకిని రక్తపాతంరాజమౌళిని మెప్పించిన మందాకిని రక్తపాతం

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ట్రైలర్ వారం క్రితమే రిలీజయింది. బాలీవుడ్ లో మోస్తరుగా హైలెట్ అయినా సౌత్ సైడ్ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ట్రైలర్ లో కంటెంట్ డెప్త్ గట్టిగానే ఉన్నా