hyderabadupdates.com movies ఇకపై డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే…

ఇకపై డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పే ఘటనలు కోకొల్లలు. ఇక, కొందరు పొలిటియన్లయితే తమపై వచ్చిన లైంగిక ఆరోపణలనుంచి తప్పించుకునేందుకు డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని వాడుకుంటున్నారు.

ఆ వీడియోల్లో ఉన్నది తాము కాదని, అది డీప్ ఫేక్ వీడియో అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాణేనికి మరోవైపు అన్నట్లు… మరికొందరు మాత్రం ఏఐకి క్రియేటివిటీని జోడించి అద్భుతమైన వీడియోలు రూపొందిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పుడు వీడియోలతో దుష్ప్రచారాలు చేస్తున్నారు.

అయితే, ఎటు చూసినా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఏఐ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ సాయంతో సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ లను అరికట్టేందుకు నడుం బిగించింది. ఐటీ నిబంధనలకు కీలక సవరణలు చేసిన కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

నూతన మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ పై లేబులింగ్ చేయడం తప్పనిసరి. ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఏఐ కంటెంట్ ను రూపొందించింది ఎవరు అన్న వివరాలు కూడా స్పష్టంగా ఉండాలని ఆదేశించింది.

ఇక, ఏఐ కంటెంట్ లేబుళ్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు తొలగించకూడదని నిబంధన విధించింది. అయితే, మార్గదర్శకాలు విడుదల చేయడం సులభమే. కానీ, ఆ మార్గదర్శకాలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందా లేక మార్గదర్శకాలకే పరిమితమై ఉదాసీన వైఖరితో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.

Related Post

ప్రశాంత్ వర్మ తొందరపడే టైమొచ్చిందిప్రశాంత్ వర్మ తొందరపడే టైమొచ్చింది

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కొద్దిరోజుల క్రితం మీడియా సర్కిల్స్, సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యాడో చూశాం. నిర్మాత నిరంజన్ రెడ్డి, తన మధ్య జరిగిన ఆరోపణలు ప్రత్యారోపణలతో వ్యవహారం ఫిలిం ఛాంబర్ కు చేరింది. ఇంకా పరిష్కారం

Prabhas Launches Global Short Film Festival to Spotlight New StorytellersPrabhas Launches Global Short Film Festival to Spotlight New Storytellers

Pan-India superstar Prabhas has unveiled a powerful new platform for aspiring filmmakers by launching The Script Craft International Short Film Festival, positioning it as a global launchpad for fresh storytelling