hyderabadupdates.com Gallery ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా post thumbnail image

బెంగ‌ళూరు : గీతా మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం టాక్సిక్. క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కీల‌క పాత్ర పోషిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. కానీ అనుకోకుండా ప్ర‌స్తుతం మ‌ధ్య ప్రాచ్యంలో యుద్దం కొన‌సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై విరుచుకు ప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కావాల్సిన టాక్సిక్ పై ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆలోచించిన మేక‌ర్స్ ఉన్న‌ట్టుండి ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చిత్ర నిర్మాతలు చివరి నిమిషంలో సినిమా విడుదల తేదీని మార్చి వాయిదా ప్రకటించడం ద్వారా అభిమానులను , ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
యష్ నటించిన టాక్సిక్ – ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఇప్పుడు జూన్ 4, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనేది ప్రపంచ ప్రేక్షకుల కోసం సినిమాను సృష్టించాలనే దార్శనికతతో తాము భావించిన చిత్రం. కన్నడ, ఇంగ్లీషులో చిత్రీకరించిన ఈ మూవీ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత‌గానో ఎదురు చూస్తున్నారంటూ తెలిపారు. సంవత్సరాల అంకితభావంతో పనిచేసిన తర్వాత, మార్చి 19న మా చిత్రాన్ని మీ అందరితో పంచు కోవడానికి మేము సంతోషించామ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా టాక్సిక్ ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.
The post ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : స‌విత‌ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : స‌విత‌

వత్సవాయి/జగ్గయ్యపేట : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్ల‌డించారు.

DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలుDK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు

DK Shivakumar : కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి కొట్టివేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. నాయకుడి కోసం మీడియానో, పార్టీలోని వారో వెతకాల్సిన

రేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డిరేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డి

కరీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్