hyderabadupdates.com movies ఇడియట్ ఆలోచన వద్దంటున్న మాధవన్

ఇడియట్ ఆలోచన వద్దంటున్న మాధవన్

2009లో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ త్రీ ఇడియట్స్ కొనసాగింపుగా ఫోర్ ఇడియట్స్ తీసే ప్లాన్ లో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఉన్నట్టు వచ్చిన వార్త కొన్ని వారాల క్రితం బాగా వైరలయ్యింది. అధికారికంగా ప్రకటన రానప్పటికీ ఖచ్చితంగా లాక్ అయ్యిందనే రీతిలో ముంబై మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన మాధవన్ తాజాగా స్పందిస్తూ సీక్వెల్ ఆలోచన ఈడియాటిక్ గా ఉందంటూ కామెంట్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడీ వయసులో తామేం చేస్తున్నట్టు చూపిస్తే జనాలు కనెక్ట్ అవుతారో అర్థం కావడం లేదని అన్నాడు.

హిరానీతో మరోసారి పని చేయడం తనకెప్పుడూ ఆనందంగా ఉంటుందని చెబుతూనే 3 ఇడియట్స్ కొనసాగింపు వద్దని చెప్పడం గమనార్హం. నిజానికి ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే తను చెప్పింది కూడా రైటే. రెండు దశాబ్దాల తర్వాత కథను కంటిన్యూ చేయడం చాలా రిస్క్. పైగా అప్పట్లో దీన్ని ఎగబడి చూసిన యువత ఇప్పుడు లేట్ ఏజ్ దారిలో ఉంటారు.

వాళ్ళు అదే పనిగా ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీ లేదు. అసలు అమీర్ ఖాన్ క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేస్తారనేది పెద్ద పజిల్. యాక్టర్స్ అందరూ దాదాపు బ్రతికే ఉన్నారు కానీ ఏజ్ ఇష్యూ వల్ల వాళ్లలో ఎందరు అంతే యాక్టివ్ నెస్ తో ఉంటారనేది చెప్పలేం.

ఇప్పటికైతే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి 3 ఇడియట్స్ గురించి వస్తున్న వార్తలు పుకారుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయినా రాజ్ కుమార్ హిరానీ లాంటి గొప్ప దర్శకుడు ఏదైనా కొత్త కథతో ఆడియన్స్ ముందుకు రావాలి తప్పించి ఎప్పుడో ఆయనే తీసిన పాత సినిమాకు పార్ట్ 2 చూపించడం సబబు కాదు.

షారుఖ్ ఖాన్ తో తీసిన డంకీ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడం హిరానీని కొంత డిస్టర్బ్ చేసినట్టు ఉంది. అయినా సరే మరో మాస్టర్ పీస్ తో మళ్ళీ జనాన్ని మెప్పిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆయన ఏం తీసినా షూటింగ్ కి విపరీతమైన సమయం తీసుకుంటారనేది వాస్తవం. 

Related Post