hyderabadupdates.com Gallery ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి

ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి

ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి post thumbnail image

ముంబై : పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు బాస‌ట‌గా నిలిచారు త‌న కాలంలో ఆడిన 14 మంది అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మాజీ కెప్టెన్లు. ఈ మేర‌కు పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి, ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. జైలులో ఉన్న త‌మ స‌హ‌చ‌రుడు ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని కోరారు. గ్రెగ్ చాపెల్ నేతృత్వంలోని ఈ పిటిషన్ ను ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కు అందజేశారు. దీనిపై సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మైక్ అథర్టన్, నాసర్ హుస్సేన్, మైక్ బ్రియర్లీ, డేవిడ్ గోవర్, క్లైవ్ లాయిడ్ , జాన్ రైట్ సంతకం చేశారు.
ప్రభుత్వం న్యాయమైన చికిత్స కోసం అభ్యర్థించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ కు త‌న సార‌థ్యంలో 1992 ప్రపంచ కప్ విజేత‌గా నిలిచిన త‌న ప‌ట్ల క‌ర్క‌శ‌త్వం ప్ర‌ద‌ర్శించ రాద‌ని పేర్కొన్నారు. క‌స్ట‌డీలో ఉన్న త‌న ఆరోగ్యం రోజు రోజుకు ఇబ్బందిక‌రంగా మారింద‌న్నారు. తీవ్ర‌మైన దృష్టి స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని వాపోయారు మాజీ కెప్టెన్లు. ఇమ్రాన్ ఖాన్ పట్ల మానవీయంగా వ్యవహరించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి విన్న‌వించారు. తను ఆట‌కు చేసిన కృషిని విశ్వ వ్యాప్తంగా ఆరాధిస్తార‌ని తెలిపారు. నైపుణ్యం, స్థితిస్థాప‌క‌త‌, నాయ‌క‌త్వం, క్రీడా స్పూర్తిపై నిర్మించిన విజ‌యం స‌రిహ‌ద్దులు దాటి త‌రాల‌కు స్పూర్తిని ఇచ్చింద‌న్నారు.
The post ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానంబ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాల‌లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. భ‌క్తుల‌తో అల‌రారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యం. ఈనెల‌లో శివ రాత్రి ప‌ర్వ‌దినం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆల‌య

వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దంవివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం

విజ‌య‌వాడ : దేశ వ్యాప్తంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా రామ‌కృష్ణ మిష‌న్ ఎన‌లేని కృషి చేస్తూ వ‌స్తోంది. ఇందులో మ‌రో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గాంధీనగర్ లోని శైలజా థియేటర్ ఎదురుగా.. నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస