hyderabadupdates.com movies ఈసారి పెద్దిరెడ్డికి కష్టమే

ఈసారి పెద్దిరెడ్డికి కష్టమే

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెట్టని కోటగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నాయకుల వ్యవహారశైలి పట్ల ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ప్రజల నాడిని పట్టుకునే దిశగా నాయకులు అడుగులు వేయాలి. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగి 17 మాసాలైనా ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల మధ్యకు రాలేకపోతున్నారు.

కనీసం ఆయన ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే వాస్తవానికి ఎమ్మెల్యే కార్యాలయానికి జనాలు వెళతారు. సమస్యలు చెప్పుకుంటారు. అర్జీలు సమర్పిస్తారు. కానీ ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం తాళాలు వేసి ఉంది. ఇప్పటివరకు ప్రజల్లోకి కూడా రాలేకపోయారు. పైగా వివిధ కేసుల్లో చిక్కుకుని పెద్దిరెడ్డి కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది.

దీనిని గమనించిన బీసీవై అధినేత బోడె రామచంద్ర యాదవ్ ప్రజలకు చేరువవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బోడె రామచంద్ర యాదవ్ పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాకు వచ్చే ఎన్నికల్లో బ్రేక్ పడడం ఖాయం అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే అంత దూరం రాదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల్లోకి వస్తారని వైసీపీ వర్గాలు చెబుతుండడం గమనార్హం.

కానీ స్థానికంగా ఉన్న రాజకీయాలను గమనిస్తే దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పెద్దిరెడ్డి బయటకు రాకపోవడం వైసీపీ పరంగా పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ లేకపోవడంతో పాటు నాయకుల చుట్టూ కేసులు ముసురుకున్న నేపధ్యంలో కేడర్ లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. దీంతో ఈ గ్యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీసీవై పార్టీ రాజకీయంగా అడుగులు ముమ్మరం చేసింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న బోడే పుంగనూరు విజయాన్ని కీలకంగా భావిస్తున్నారు. ఈ క్రంలో ఆయనకు సానుకూల వాతావరణం నెలకొందన్న చర్చ సాగుతోంది.

Related Post

ఏపీలో 120 చోట్ల ఏసీబీ దాడులు.. డబ్బును బయటకు విసిరేశారు!ఏపీలో 120 చోట్ల ఏసీబీ దాడులు.. డబ్బును బయటకు విసిరేశారు!

ఏపీలోని 120 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అధికారుల సోదాలతో అప్రమత్తం అయిన డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులకు తాళం వేసుకొని పరారయ్యారు. ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుపై