hyderabadupdates.com movies ఈసీ పై మరోసారి విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

ఈసీ పై మరోసారి విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సర్దార్జీగా అభివర్ణించారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమీషన్ వేగంగా స్పందించింది. ఆయన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.

ఈ రోజు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓట్ చోరీపై మీడియా సమావేశం నిర్వహించారు. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ వాళ్లు అయినంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వేలాది మందికి ఉత్తరప్రదేశ్, హరియాణాలో ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇళ్లు లేని ఓటర్లకు ఇంటి నెంబర్ జీరో ఇచ్చామని ఈసీ చెప్పింది. అటువంటి వాటిని మేము తనిఖీ చేశాం. ఆ ఓటర్లకు ఇళ్లు ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు.

అనేక మంది చిరునామాలు తనిఖీ చేయకుండానే ఓట్లు ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎటువంటి కారణాలు లేకుండా 3.5 లక్షల మంది ఓట్లను తొలగించారని అన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే అని తెలిపారు. బీజేపీకి చెందిన ఒక ఇంట్లోనే 66 ఓట్లు ఉన్నాయని అన్నారు. మరో ఇంట్లో ఏకంగా 501 ఓట్లు ఉన్నాయని తెలిపారు. మరో చిన్న ఇంటిలో 108 ఓట్లు ఉన్నాయన్నారు. ఒక ఇంటిలో 10కిపైగా ఓట్లు ఉంటే తనిఖీ చేయాలని నిబంధన ఉన్నా దానిని అమలు చేయలేదని తెలిపారు.

ఈసీ బీజేపీకి సహాయం చేసిందన్నారు. హరియాణాలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ఓటర్లు ఉన్నారని తెలిపారు. తప్పుడు చిరునామాలతో 93 వేల ఓట్లు, ఒకే ఫొటోతో రెండు బూత్ లలో 223 ఓట్ల ఉన్నాయని ఆరోపించారు. ఈసీని అడ్డు పెట్టుకుని బీజేపీ హరియాణాలో సర్కార్ చోరీ చేసిందన్నారు. ఇప్పుడు బిహార్లో ఓట్ల చోరీకి బీజేపీ యత్నిస్తుందన్నారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని రాహుల్ తెలిపారు.

Related Post

“ఆ ఎలుకలు మా పెట్స్”: రెస్టారెంట్‌ ఓనర్ షాకింగ్ ఆన్సర్“ఆ ఎలుకలు మా పెట్స్”: రెస్టారెంట్‌ ఓనర్ షాకింగ్ ఆన్సర్

మధ్యప్రదేశ్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు చేసిన తనిఖీల్లో వెలుగు చూసిన విషయాలు విని కళ్లు తేలేయాల్సిందే. అక్కడ వంటగదిలో కారుతున్న నూనె మరకలు, తెరిచి ఉంచిన ఆహారంపై వాలిన ఈగలు, పెరుగులో ఈదుతున్న కీటకాలు అధికారులను షాక్ అయ్యేలా చేశాయి.