hyderabadupdates.com movies ఈ రెండు ఫొటోలు చాలు.. కూట‌మి బ‌లం చెప్ప‌డానికి!

ఈ రెండు ఫొటోలు చాలు.. కూట‌మి బ‌లం చెప్ప‌డానికి!

“ఏపీలో కూట‌మి బ‌లం ఏ విధంగా ఉందో చెప్ప‌డానికి ఈ రెండు ఫొటోలు చాలు!“ ఈ మాట అన్న‌ది ఎవ‌రో టీడీపీ నాయ‌కులో.. బీజేపీ నేత‌లో కాదు.. త‌ట‌స్థులు, రాజ‌కీయ విశ్లేష‌కులు!!. అంతేకాదు.. నెటిజ‌న్లు కూడా ఫిదా అవుతున్న ఈ రెండు ఫొటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అవే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి ఉన్న ఫొటో. దీనిలో `అత‌డే మా సైన్యం“ అన్న‌ట్టుగా ప్ర‌ధాని వెంట ఇద్ద‌రు నాయ‌కులు అడుగులు వేస్తున్న తీరుకు నెటిజ‌న్లు ఫిదా అవుతుంటే.. నాయ‌కుల హావ భావాలు చూసిన విశ్లేష‌కులు.. కూడా మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు.

ఫొటో-1

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని పుట్ట‌ప‌ర్తిలో భ‌గ‌వాన్ శ్రీస‌త్య‌సాయి బాబా శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని స‌త్య‌సాయి కుల్వంత్ హాల్‌లోకి సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తోడ్కొని వెళ్లారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ ముందు న‌డుస్తుంటే.. ఆయ‌న‌కు కుడి ప‌క్క‌న ఉప ముఖ్య‌మంత్రి.. రెండు అడుగులు వెన‌గ్గా.. అడుగులు వేస్తూ ముందుకు సాగారు. మ‌రోవైపు సీఎం చంద్ర‌బాబు అదే డిస్టెన్స్‌లో ప్ర‌ధాని మోడీని అనుస‌రించారు. ఈ సమ‌యంలో ముగ్గురు నేత‌లు చాలా గంభీరంగా, ఎంతో ఆత్మ విశ్వాసంతో క‌నిపించ‌డాన్ని నెటిజ‌న్లు ప్ర‌స్తావిస్తున్నారు.

ఫొటో-2

స‌త్య‌సాయి వేడుక‌ల నిమిత్తం అనంత‌పురంలోని విమానాశ్ర‌యానికి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు వ‌చ్చిన‌ప్పుడు తీసిన ఫొటో ఇది. అయితే.. ఇద్దరూ ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ రాక‌కోసం వేచి ఉన్నారు. అంతేకాదు.. ఇరువురు ఎంతో దీర్ఘంగా చ‌ర్చించుకుంటున్న‌ట్లు క‌నిపించింది. అంతేకాదు.. ఇద్ద‌రూ ప్ర‌శాంతంగా ఉన్నారు. ఈ ఫొటోను కూడా మెజారిటీ నెటిజ‌న్లు మెచ్చుకున్నారు. ఇరువురు నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌తను ప్ర‌స్తావిస్తూ కామెంట్లు చేశారు. దీనిపై విశ్లేష‌కులు కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి కూట‌మి బ‌లం ఎలా ఉందో చెప్పొచ్చ‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Related Post