hyderabadupdates.com movies ‘ఉస్తాద్’ను ‘దురంధర్’ తో పోల్చిన హరీష్ శంకర్

‘ఉస్తాద్’ను ‘దురంధర్’ తో పోల్చిన హరీష్ శంకర్

‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్లో సినిమా అని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో ఎంతో ఎగ్జైట్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ ఈ సినిమా అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ తప్పితే సినిమాలో పెద్దగా విషయం లేదన్నది అందరూ అంగీకరిస్తున్న విషయం. అభిమానుల వరకు కొంత ఓకే అనిపించినా.. మరీ మూసగా అనిపించే కథాకథనాలతో న్యూట్రల్ ఆడియన్సు‌ని దర్శకుడు హరీష్ శంకర్ తీవ్ర నిరాశకు గురి చేసిన మాట వాస్తవం.

నిష్కర్షగా మాట్లాడాలంటే అభిమానులకు కూడా పూర్తి సంతృప్తినివ్వలేదీ చిత్రం. సినిమా థియేట్రికల్ రన్ ముగింపు దశకు వస్తున్న తరుణంలో నెమ్మదిగా అభిమానులు సైతం ఓపెన్ అయిపోతున్నారు. సినిమాలో లోపాల గురించి విశ్లేషిస్తూ.న. హరీష్ శంకర్‌‌ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఎలాగైనా నిలబెట్టాలని ప్రమోషన్ల విషయంలో హరీష్ శంకర్ పోరాటం కొనసాగించడం బాగానే ఉంది కానీ.. ఈ క్రమంలో ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు మాత్రం మరీ విడ్డూరంగా ఉంటున్నాయి.

‘గబ్బర్ సింగ్’ కంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే గొప్ప అంటూ దాన్ని కొనియాడడం మొదలులకుని గత వారం పది రోజుల్లో హరీష్ శంకర్ వ్యక్తం చేసిన ఎన్నో అభిప్రాయాలు ట్రోలింగ్‌కు దారి తీశాయి. రొటీన్‌ కథాకథనాలతో చుట్టేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విషయంలో తాను గర్విస్తున్నానంటూ ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. అంతటితో ఆగకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో తాను టచ్ చేసిన దేశభక్తి పాయింట్‌ను ‘దురంధర్’లో దర్శకుడు ఆదిత్య ధర్ ఫుల్ లెంత్‌లో చూపించి మెప్పించాడంటూ పోలిక పెట్టుకోవడం హరీష్ శంకర్‌కే చెల్లింది.

తన మాటలకు, తీసే సినిమాలకు పొంతన ఉండదని అభిమానులు చేసే కామెంట్ల గురించి స్పందిస్తూ.. మన పాండిత్యాన్నంతా సినిమాల్లో చూపించలేమని.. మన క్లైంట్ ఎవరు అన్నది ముఖ్యమని, అందుకు తగ్గట్లే సినిమాలు తీస్తామంటూ హరీష్ శంకర్ ప్రేక్షకుల స్థాయిని తగ్గించి మాట్లాడ్డమూ వివాదాస్పదం అవుతోంది. ఓవైపు హరీష్ తీసిన రొటీన్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను పక్కన పెట్టి ‘దురందర్’ లాంటి కొత్తదనం ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తుంటే.. తెలుగు ప్రేక్షకులు సగటు మాస్ సినిమాలే ఆశిస్తారన్నట్లుగా మాట్లాడ్డం విడ్డూరం.

ఇవన్నీ ఒకెత్తయితే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ట్రోలింగ్‌కు గురవుతున్న ఒక సన్నివేశం గురించి హరీష్ చెప్పిన లాజిక్ మరో ఎత్తు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ జీపు నుంచి దిగే సన్నివేశాన్ని రెండుసార్లు, వేర్వేరు రకాలుగా చూపించారు సినిమాలో. ఇది ఎడిటింగ్ లోపం అన్నది స్పష్టం. దీని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే.. అందులో ఒకటి తాను తీసింది, ఇంకోటి ఫైట్ మాస్టర్ తీసిందని.. కానీ తనకు రెండూ నచ్చడంతో లాజిక్ గురించి ఆలోచించకుండా రెండూ సినిమాలో పెట్టేశానంటూ హరీష్ శంకర్ ఒక విడ్డూరమైన లాజిక్ చెప్పడం విశేషం.

Related Post

నిన్న బాబు – నేడు పవన్!!నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ సూత్రం తెలుసుకున్న నేత సీఎం చంద్రబాబు నాయుడు. 23 స్థానాలు గెలిచినప్పుడైనా, 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పుడైనా ఆయన అదే

Twitterati react to rumored lovebirds Thalapathy Vijay and Trisha Krishnan’s first public appearance togetherTwitterati react to rumored lovebirds Thalapathy Vijay and Trisha Krishnan’s first public appearance together

Their public appearance comes at a time when speculation about their alleged relationship continues to attract attention. Recently, Thalapathy Vijay’s wife Sangeetha Sornalingam reportedly filed for divorce, bringing an end