hyderabadupdates.com movies ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. మార్చి 26 విడుదల లాకైపోవడంతో చేతిలో ఉన్న ఇరవై ఏడు రోజులకు సరిపడా ప్రమోషన్లకు దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈసారి సోషల్ మీడియా అభిమానులను బాగా యాక్టివ్ చేయబోతున్నట్టు సమాచారం.

అయితే ఉస్తాద్ కు ఓజి రేంజ్ లో అంచనాలు లేవు. ఎంత పవన్ కళ్యాణ్ మూవీ అయినా ఎగ్జైట్ మెంట్ కలిగేలా పబ్లిసిటీ మెటీరియల్ సిద్ధం చేయాలి. హరిహర వీరమల్లు విషయంలో ఇది నిర్లక్ష్యానికి గురి కావడం వల్లే ఓపెనింగ్స్ తప్ప పెద్దగా చెప్పుకునే వసూళ్లు రాలేదు.

ఉస్తాద్ భగత్ సింగ్ కు ఆ టెన్షన్ లేకపోయినా కాంబినేషన్ పరంగా అభిమానుల నమ్మకం పరంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా ఉంది. కారణం దర్శకుడు హరీష్ శంకర్ గత చిత్రం మిస్టర్ బచ్చన్ దారుణంగా పోవడమే. కాకపోతే గబ్బర్ సింగ్ ఇచ్చిన వీరాభిమానిగా ఆయన మీద కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్ లో ఉంది.

ముందైతే ఇది తేరి రీమేక్ కాదని, స్టోరీ పూర్తిగా కొత్తదనే అభిప్రాయం కలిగించేలా టీజర్, ట్రైలర్ కట్ చేయాలి. ఇక వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఊపందుకున్నాయి. మైత్రి సంస్థ థియేటర్స్ నుంచి వంద నుంచి నూటా యాభై కోట్ల మధ్యలో బిజినెస్ ఆశిస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇంకా ఫైనల్ కాలేదు.

సంక్రాంతి తర్వాత బాక్సాఫిస్ పూర్తిగా డ్రై అయిపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కు సునామిలా ఓపెనింగ్ వస్తుందని, మౌత్ టాక్ పాజిటివ్ ఉంటే కనక ఓజి స్థాయిలో రెవిన్యూ ఆశించవచ్చని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. సరైన కంటెంట్ లేక థియేటర్లకు దూరంగా ఉన్న మాస్ జనాలు పవన్ కోసం ఖచ్చితంగా వస్తారనేది నిర్మాతల ధీమా.

అందులోనూ పెద్ది వదులుకున్న డేట్, ప్యారడైజ్ తప్పుకున్న అడ్వాంటేజ్ ఇలా చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. కాకపోతే సరిగ్గా వారం ముందు దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ వస్తున్న నేపథ్యంలో కాంపిటీషన్ అయితే ఈజీగా ఉండదు. ముఖ్యంగా పక్కా రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఉంటుంది.

Related Post

Nithiin Teams Up With VI Anand for a New Sci-Fi Film; Shoot to Begin SoonNithiin Teams Up With VI Anand for a New Sci-Fi Film; Shoot to Begin Soon

Tollywood actor Nithiin has officially announced his next film, tentatively titled Nithiin36, and it is already creating strong buzz in film circles. The project brings together Nithiin and creative filmmaker

అమరావతి రైతులు… హ్యాపీనా?అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని నియ‌మించిన సీఎం చంద్ర‌బాబు.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికి మూడు సార్లు రైతుల‌తో కేంద్ర