హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడు, తెలంగాణకు చెందిన హరీష్ శంకర్ తీసిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో కీ రోల్ పోషించాడు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . తనతో పాటు అందాల భామలు శ్రీలీల, రాశీ ఖన్నా కీ రో ల్స్ పోషించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. భారీ ఖర్చు పెట్టారు. సినిమా కాసుల వర్షం కురిపించడంతో తెగ సంతోషానికి లోనయ్యాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు మ్యూజిక్ ఇచ్చారు. ఒకరు ఎస్ఎస్ థమన్ కాగా మరొకరు దేవిశ్రీ ప్రసాద్.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం భారీ విజయం వైపు దూసుకు పోతుండడం పట్ల స్పందించాడు దర్శకుడు హరీష్ శంకర్. చాలా సంతోషంగా ఉందన్నాడు. తామిద్దరి కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులను తిరగ రాసిందన్నాడు. ఇప్పుడు కూడా అంతకు మించి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉండబోతోందని జోష్యం చెప్పాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ను చూసి మురిసి పోతున్నారని, ఆదరిస్తున్నారని అన్నాడు హరీష్ శంకర్. దర్శకుడు మూవీ గురించి ఆశు కవిత చెప్పాడు. మైత్రీ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని ది..”బాగా ఖర్చు పెట్టే గోత్రం.. కలెక్షన్లు రాబట్టే నక్షత్రంష. రాశి ఖన్నా ది: “నవ్వించే గోత్రం.. కవ్వించే నక్షత్రం, శ్రీ లీల ది “ముదురు గోత్రం.. దేశ ముదురు నక్షత్రం” .
“అందమైన గోత్రం.. ఆహ్లాదకరమైన నక్షత్రం హరీష్ శంకర్ ది: “శ్రమించే గోత్రం.. సహించే నక్షత్రం అంటూ తన గురించి కూడా గొప్పగా చెప్పాడు.
The post ఉస్తాద్ భగత్ సింగ్ జోష్ పవన్ ఖుష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఉస్తాద్ భగత్ సింగ్ జోష్ పవన్ ఖుష్
Categories: