hyderabadupdates.com movies ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి తరహా ఫాంటసీ కథతో అతనీ సినిమా చేయడానికి సిద్ధమవడం.. అనౌన్స్‌మెంట్ పోస్టరే క్రేజీగా ఉండడం.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా మొదలు కావడం.. ఇలా ప్రతి విషయంలోనూ ఎగ్జైటింగ్‌గా కనిపించింది ఈ సినిమా.

కానీ ‘విశ్వంభర’ టీజర్ లాంచ్ కాగానే.. ఆ సినిమా చుట్టూ ఉన్న హైప్ అంతా ఒక్కసారిగా తగ్గిపోయింది. టీజర్ మీద విపరీతంగా ట్రోల్స్ రావడంతో టీం కంగారు పడిపోయింది. సినిమాను ముందు అనుకున్న డేట్‌కి రిలీజ్ చేయకుండా వెనక్కి తగ్గింది. వీఎఫెక్స్ మీద మళ్లీ పని చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది సంక్రాంతికి అనుకున్న సినిమా కాస్తా.. ఈ సంక్రాంతికి కూడా రాలేదు. వేసవికి వాయిదా వేశారు.

కానీ వేసవికి అయినా సినిమా వస్తుందా అన్న అనుమానాలతో అభిమానులు ఉన్నారు. ఇలాంటి లాంగ్ డిలేయ్డ్ మూవీస్‌కి తగ్గిన హైప్‌ను మళ్లీ పెంచడం అంత తేలిక కాదు. ఐతే దీని తర్వాత మొదలై.. దీని కంటే ముందు రిలీజైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించే దిశగా దూసుకెళ్తుండడం ‘విశ్వంభర’ టీంకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే.

ఒక దశలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ మీద కూడా అనుమానాలు కలిగాయి. ఈ సినిమా ఆడుతుందో లేదో అనిపించింది. ఒకవేళ దీని ఫలితం తేడా కొడితే.. ‘విశ్వంభర’ పరిస్థితి అగమ్య గోచరంగా మారేది. ఆల్రెడీ ‘భోళా శంకర్’తో దెబ్బ తిన్న చిరు మార్కెట్ మరింత డౌన్ అయ్యేది. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ‘విశ్వంభర’కు బిజినెస్ చేయడం సవాలుగా మారేది. దాని రిలీజ్ ప్రమాదంలో పడేది.

కానీ ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని చిరు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. చిరు బాక్సాఫీస్ పవర్ ఏంటో బయ్యర్లకు అర్థమవుతోంది కాబట్టి ఆయన తర్వాతి సినిమాను కొనడానికి ముందుకు వస్తారు. కాబట్టి ‘విశ్వంభర’ను బయట పడేయడానికి మార్గం దొరికినట్లే. కొంచెం జాగ్రత్తగా పని చేసి బెటర్ ఔట్ పుట్ తీసుకొస్తే చిరు ఖాతాలో మరో పెద్ద హిట్ పడే అవకాశం కూడా ఉంటుంది.

Related Post

కేసీఆర్ సభకు రాకుంటే బీఆర్ఎస్ ఖతంకేసీఆర్ సభకు రాకుంటే బీఆర్ఎస్ ఖతం

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత శాసన సభలో అడుగుపెట్టిన కేసీఆర్ పది నిమిషాలు కూడా సభలో ఉండలేదని, కేవలం అటెండెన్స్ కోసమే వచ్చారని ఆరోపిస్తున్నారు.

దురంధర్ కొట్టిన దెబ్బ చిన్నది కాదుదురంధర్ కొట్టిన దెబ్బ చిన్నది కాదు

గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే మెయిన్ సెంటర్స్ లో కొన్ని షోలు కొనసాగిస్తున్నారంటే ఎంత పాజిటివ్ గా జనంలోకి దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. రెండు వందల