hyderabadupdates.com movies ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే, చాలా సందర్భాల్లో ఒక ప్రభుత్వంలో సగం పూర్తయి పెండింగ్ లో ఉన్న పనులు మరో ప్రభుత్వంలో పూర్తవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో ఫలానా పనికి క్రెడిట్ మాదంటే మాదే అని రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడుతుంటాయి.

తెలంగాణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య ఇదే తరహా క్రెడిట్ వార్ హాట్ టాపిక్ గా మారింది. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ అండర్ బ్రిడ్జి పనులకు నిధులు తాము తెచ్చామంటే తాము తెచ్చామంటూ ఇరువర్గాల నేతలు బాహాబాహీకి దిగారు.

ఈ క్రమంలోనే ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపైకి ఒకరు దూసుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.

Related Post

Malavika Mohanan All Set for a Big Telugu Debut with The Raja SaabMalavika Mohanan All Set for a Big Telugu Debut with The Raja Saab

Malavika Mohanan is entering Telugu cinema in the most exciting way possible — with The Raja Saab, starring none other than India’s biggest superstar, Prabhas. The actress is thrilled about