hyderabadupdates.com Gallery ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి post thumbnail image

రాజమండ్రి : తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడి తీరుపై ధ్వజమెత్తారు. సాక్షాత్తూ లోక్ సభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో కలిసి రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్రానికే అవమానకరం అని అన్నారు. బయట డ్రగ్స్ నిర్మూలన గురించి ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు, లోపల ఇలాంటి డ్రగ్స్ బానిసలను చట్టసభల్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. పట్టుబడిన తర్వాత కూడా పోలీసుల (ఈగిల్ టీం) పైనే కాల్పులు జరపడం గుండా రాజ్యానికి నిదర్శమని అన్నారు.
డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు అని తెలిపారు. ఇంత దారుణంగా అధికార పార్టీ ఎంపీ ఇలా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినా ఇంకా తెలుగుదేశం పార్టీ స్పందించక పోవడం దారుణం అన్నారు మార్గాని భ‌ర‌త్. తక్షణమే త‌న‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్ర‌శ్నించారు. డ్రగ్స్ నిర్మూలించాలని బయట ప్రచారాలు చేస్తూ.. లోపల మాత్రం అవే డ్రగ్స్ తీసుకుంటూ పట్టు బడటం సిగ్గు చేటు అనిపించ‌డం లేదా అని నిల‌దీశారు మాజీ ఎంపీ.
The post ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలిజీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్

న‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పున‌టి ప్ర‌త్యూష కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు

న్యూఢిల్లీ : న్యాయం గెలిచింది. స‌త్యం బ‌తికే ఉంద‌ని తేలి పోయింది. ఒక‌టా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచ‌ల‌నం సృష్టించిన న‌టి ప్ర‌త్యూష కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఇదిలా

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలుDK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

    బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు.