hyderabadupdates.com movies ఎట్టకేలకు… అక్కినేని వారి టైం?

ఎట్టకేలకు… అక్కినేని వారి టైం?

ఒకప్పుడు అక్కినేని నాగార్జున టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఎంతటి వైభవం చూశాడో తెలిసిందే. కానీ తర్వాతి తరం స్టార్ల రాకతో ఆయన జోరు తగ్గింది. గత దశాబ్దంలో నాగ్ సక్సెస్ రేట్ పడిపోయింది. ఆయన మార్కెట్ డౌన్ అయింది. గత కొన్నేళ్లలో అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’ లాంటి యావరేజ్ మూవీస్‌ తప్పితే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.

ఈ ఏడాది కుబేర, కూలీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రలతో నాగ్ క్రేజ్ తెచ్చుకున్నాడు కానీ.. సోలో హీరోగా ఆయనలో జోష్ చూసి చాన్నాళ్లయింది. ఐతే తన వందో సినిమాతో మళ్లీ నాగ్ ఫామ్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. అంతకంటే ముందు తన పాత సినిమాతో ఫ్యాన్స్‌ను సంబరాలకు సిద్ధం చేస్తున్నాడు నాగ్. ఆ చిత్రమే.. శివ.

నాగ్ కెరీర్‌నే కాక తెలుగు సినిమా చరిత్రనే మలుపు తిప్పిన సినిమా.. శివ. ఈ చిత్రాన్ని అక్కినేని కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీ రిలీజ్ చేస్తోంది. బాగా ఖర్చు, శ్రమ పెట్టి ఈ చిత్రాన్ని 4కేలోకి మార్చారు. విజువల్స్, ఆడియోను రీమాస్టర్ చేయించారు. గత కొన్నేళ్లలో ది బెస్ట్ క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్న చిత్రాల్లో ఇది ఒకటని చెప్పాలి. నిన్న ప్రిమియర్ చూసిన వాళ్లందరూ క్వాలిటీ అదిరిందని అంటున్నారు.

ఒక కొత్త సినిమా చూసిన అనుభూతిని ‘శివ’ ఇస్తుందంటున్నారు. గతంలో నాగ్ సినిమాలు పాతవి కొన్ని రీ రిలీజ్ అయ్యాయి. వాటికి స్పందన అంతంతమాత్రం. వేరే హీరోల ఫ్యాన్స్ రీ రిలీజ్‌ సెలబ్రేషన్లు చూసి అక్కినేని అభిమానులు ఫీలై ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ ‘శివ’తో వాళ్లు గట్టిగా సెలబ్రేట్ చేసుకునే ఛాన్సొచ్చింది. ఈ సినిమాకు బాగానే బజ్ క్రియేట్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాను సెలబ్రేట్ చేయడానికి ఇండస్ట్రీ జనాలు కూడా రెడీ అయ్యారు. కాబట్టి చాన్నాళ్ల తర్వాత అక్కినేని వారి టైం వచ్చిందని అనిపిస్తోంది.

Related Post

సంక్రాంతి పంచాయితీ.. మళ్లీ మొదలుసంక్రాంతి పంచాయితీ.. మళ్లీ మొదలు

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే సీజన్ అయిన సంక్రాంతికి అంతిమంగా వచ్చే సినిమాలేవి.. రేసు నుంచి తప్పుకునేవి ఏవి అనే చర్చ ప్రతిసారీ ఉండేదే. ఈ విషయంలో చివరి వరకు సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. కొన్ని చిత్రాలు మొదట్నుంచి పోటీలో ఉండి

రాజకీయాల్లోకి రంగా కుమార్తె!రాజకీయాల్లోకి రంగా కుమార్తె!

త్వరలో వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. విజయవాడలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. వంగవీటి రాధా రంగా మిత్రమండలి