జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమాగా ‘డ్రాగన్’ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘దేవర’తో మంచి ఫలితాన్నే అందుకున్న యంగ్ టైగర్.. ‘వార్-2’తో షాక్ తిన్న నేపథ్యంలో ‘డ్రాగన్’ పెద్ద హిట్ అవడం చాలా అవసరం. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో ఈ సినిమా ఆరంభం నుంచే బంపర్ హైప్ తెచ్చుకుంది.
కొన్ని నెలల కిందటే చిత్రీకరణ మొదలవడంతో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఐతే ఇటీవల ‘డ్రాగన్’ గురించి కొంత నెగెటివ్ ప్రచారం జరిగింది. ఇప్పటిదాకా చిత్రీకరించిన సన్నివేశాల్లో కొన్ని సంతృప్తికరంగా రాలేదని.. దీంతో అదంతా పక్కన పడేశారని.. షూటింగ్ కూడా ఆపేశారని.. వార్తలు వచ్చాయి. అలాగే ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా చర్చ జరిగింది. ‘దేవర’లో ఉన్నంత ఆకర్షణీయంగా తారక్ లేడనే కామెంట్లు వినిపించాయి.
క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందనుకున్న ‘డ్రాగన్’ గురించి ఇలాంటి ప్రచారాలు జరగడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. టీం నుంచి స్పష్టత కోసం ఎదురు చూశారు. కానీ ఎవ్వరూ స్పందించకపోవడంతో ఈ వార్తలే నిజమా అనే సందేహాలు కలిగాయి. ఐతే ఇప్పటివరకు ఏం జరిగిందో కానీ.. ఇప్పుడైతే ‘డ్రాగన్’ టీం తిరిగి షూటింగ్ మొదలు పెడుతున్నట్లు సమాచారం. కొత్త షెడ్యూల్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీం సెట్స్‌లోకి అడుగు పెట్టేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటిదాకా తీసిందంతా ట్రాష్‌లో పడేశారన్నది నిజం కాదని.. కొన్ని సీన్లు మాత్రం రీషూట్ చేయబోతున్నారని టీం వర్గాలు చెబుతున్నాయి. తారక్ చివరగా కనిపించినప్పటితో పోలిస్తే ఇప్పుడు బెటర్ లుక్‌లోకి మారాడని.. చిన్న చిన్న ఇబ్బందులన్నింటినీ సరి చేసుకుని ఇక విరామం లేకుండా షూటింగ్ చేయాలని టీం ఫిక్సయిందని అంటున్నారు. ఐతే మధ్యలో వచ్చిన బ్రేక్, రీషూట్ల వల్ల ముందు ప్రకటించినట్లు వచ్చే ఏడాది జూన్‌లో సినిమా రాకపోవచ్చని స్పష్టమవుతోంది.