hyderabadupdates.com movies ఎన్టీఆర్ కోసం కథ మార్చిన ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్ కోసం కథ మార్చిన ప్రశాంత్ నీల్

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడమే అందుక్కారణం. ఐతే సాధారణంగా ప్రశాంత్ వేగంగానే సినిమాలు తీస్తాడు కానీ డ్రాగన్ బాగా ఆలస్యం అవుతోంది.

సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లవుతోంది. షూట్ ఏడాది ముందే మొదలైంది. ముందు ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూట్ కొంత ఆలస్యం అవుతుండడంతో ఈ ఏడాది చివరికైనా రిలీజైతే చాలు అనుకున్నారు ఫాన్స్. కానీ డ్రాగన్ అనూహ్యంగా 2027 జూన్‌కు వాయిదా పడిపోయింది.

దీంతో తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ రోజుల్లో అన్ని పెద్ద సినిమాలూ వాయిదా పడడం కామన్ అయిపోయినా మరీ ప్రశాంత్ సైతం ఇంత లేట్ చెయ్యడం ఏంటి అని వారు అసహనానికి గురవుతున్నారు.

ఐతే మధ్యలో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కథను మార్చడమే ఈ ఆలస్యానికి కారణం అని వెల్లడైంది. డ్రాగన్ ప్రొడక్షన్ టీంలో ఒకరైన చెర్రీ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన జెట్లీ ప్రమోషన్లలో భాగంగా డ్రాగన్ గురించి మాట్లాడారు.

గ‌త ఏడాది విడుద‌లైన తార‌క్ బాలీవుడ్ మూవీ వార్-2 స‌రిగా ఆడ‌ని నేప‌థ్యంలో డ్రాగ‌న్ క‌థ‌లో ప్ర‌శాంత్ కొన్ని మార్పులు చేర్పులు చేసిన‌ట్లు చెర్రీ వెల్ల‌డించాడు. ఈ కార‌ణంగా డ్రాగ‌న్ షూట్ కొంత కాలం ఆగినట్లు కూడా ఆయ‌న చెప్పాడు. ఐతే షూట్ విష‌యంలో ప్ర‌శాంత్ చాలా స్పీడుగా ఉంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే అని.. ఇప్పుడు షెడ్యూళ్లు అనుకున్న ప్ర‌కారం వేగంగా సాగిపోతున్నాయి.. వ‌చ్చే ఏడాది చెప్పిన డేటుకే సినిమా వ‌స్తుంద‌ని చెర్రీ ధీమా వ్య‌క్తంచేశాడు.

మ‌రోవైపు ప్ర‌భాస్ సినిమా ఫౌజీ షూట్ 80 వాతం దాకా పూర్త‌యింద‌ని.. మూడు యాక్ష‌న్ సీక్వెన్సులు, కొంచెం టాకీ పార్ట్ మాత్ర‌మే మిగిలుంద‌ని చెర్రీ వెల్ల‌డించాడు. ప్ర‌భాస్ టాకీ పార్ట్ అయిపోయింద‌ని.. యాక్ష‌న్ పార్ట్ మాత్ర‌మే షూట్ చేయాల్సి ఉంద‌ని చెప్పాడు చెర్రీ.

Related Post

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉందిడెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. అన్ని చోట్ల ఓపెన్ అయ్యాక ట్రెండింగ్ ఏ స్థాయిలో ఉందనేది క్లారిటీ వస్తుంది. అయితే ట్రైలర్

Daaku Maharaaj OST Delayed Again as Thaman Misses Release DateDaaku Maharaaj OST Delayed Again as Thaman Misses Release Date

Daaku Maharaaj was Balakrishna’s film released during the last Sankranthi. Bobby Kolli directed this mass action drama, with Pragya Jaiswal and Shraddha Srinath playing the leading ladies. The film’s composer,