hyderabadupdates.com Gallery ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మూడు ఐపీఎల్ టికెట్లు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మూడు ఐపీఎల్ టికెట్లు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మూడు ఐపీఎల్ టికెట్లు post thumbnail image

బెంగ‌ళూరు : ఐపీఎల్ టికెట్ల వ్య‌వ‌హారం తీవ్ర దుమారానికి తెర తీయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ త‌రుణంలో దానిని సరిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) మ్యాచ్ ల కు గాను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు 3 టికెట్లు , అంత‌ర్జాతీయ మ్యాచ్ ల‌క‌కు 2 టికెట్లు కేటాయించేందుకు క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంక‌టేశ్ ప్ర‌సాద్ ఒప్పుకున్నార‌ని తెలిపారు. బెంగళూరులోకేఎస్సీఏ, ఆర్సీబీ యాజ‌మాన్య ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు డీకే. చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ ల‌ను వీక్షించేందుకు ఈ మేర‌కు ఒప్పందం కుదిరింద‌ని వెల్ల‌డించారు.
ఇదిలా ఉండ‌గా టికెట్ల వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున శాస‌న స‌భ వేదిక‌గా నిలదీశారు అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యులు. దీనిపై సీరియస్ గా యాక్ష‌న్ తీసుకోవాల‌ని కోరారు. దీంతో రంగంలోకి దిగారు ఉప ముఖ్య‌మంత్రి. ఎమ్మెల్యేల‌కు ఉచితంగా టికెట్లు కేటాయించ‌క పోతే ఎలా అని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఆర్. అశోక్ నిప్పులు చెరిగారు. ఆయ‌న‌తో పాటు మ‌రో ఎమ్మెల్యే విజ‌యానంద్ కాశ‌ప్ప‌న‌వ‌ర్ కూడా దీనిని ప్ర‌స్తావించారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఉచితంగా టికెట్లు ఇప్పించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు డీకే శివ‌కుమార్. రాజస్థాన్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా , గుజరాత్ వంటి రాష్ట్రాల్లో టికెట్ల పంపిణీలో బ్యూరోక్రాట్లు ముఖ్య భూమిక పోషిస్తార‌ని అన్నారు .
వారితో పోలిస్తే కర్ణాటకలో ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉందన్నారు డిప్యూటీ సీఎం.
అయితే క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ కు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
The post ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మూడు ఐపీఎల్ టికెట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కేరళ సీఎం రేసులో నేను లేను : శ‌శి థ‌రూర్కేరళ సీఎం రేసులో నేను లేను : శ‌శి థ‌రూర్

కేర‌ళ : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కేర‌ళ రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోంద‌ని, అయితే సీఎం ఎవ‌రు అవుతార‌నే

CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్

    పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే

స‌త్తా చాటిన భార‌త్ తేలి పోయిన పాకిస్తాన్స‌త్తా చాటిన భార‌త్ తేలి పోయిన పాకిస్తాన్

శ్రీ‌లంక : కోట్లాది మంది ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన కీల‌క‌మైన దాయాదుల పోరులో చిట్ట చివ‌ర‌కు భార‌త కుర్రాళ్లు స‌త్తా చుట్టారు. సూర్య భాయ్ కెప్టెన్సీలో విజ‌య ప‌రంప‌ర కొన‌సాగిస్తూనే ఉంది టీమిండియా. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా