రాయచూర్ జిల్లా : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒకరు మృతి చెందారు. పలువురిపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో రాయచూర్ జిల్లా ఎస్పీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. ఈ తరుణంలో తాజాగా శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు ఇంటికి నిప్పంటించారు. దీంతో ప్రమాద ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో బతికి బయట పడ్డారు గాలి జనార్దన్ రెడ్డి కుటుంబీకులు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బెంగళూరులో ఉన్నారు గాలి జనార్ధన్ రెడ్డి. ఘటనపై బళ్లారి జిల్లా పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి కి నిప్పు పెట్టిన ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా జనవరి 1వ తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు. కాగా ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
The post ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు
Categories: