hyderabadupdates.com Gallery ఏఐ యుగంలో గూగుల్ డేటా సెంట‌ర్ కీల‌క పాత్ర‌

ఏఐ యుగంలో గూగుల్ డేటా సెంట‌ర్ కీల‌క పాత్ర‌

ఏఐ యుగంలో గూగుల్ డేటా సెంట‌ర్ కీల‌క పాత్ర‌ post thumbnail image

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తున ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే. సోమ‌వారం గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ప్రసంగించారు. గూగుల్ ఇండియా ఏఐ హబ్‌కు ఇవాళ చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్‌కు ఓ పునాది రాయి లాంటిదని ఆశాభావం వ్య‌క్తం చేశారు. భారత డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు. గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వే గా ఉన్న ముంబై , చెన్నైలతో పాటు విశాఖ కూడా ఇప్పుడు కీలకంగా మారిందన్నారు. కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను అనుసంధానం చేస్తాయన్నారు.
సముద్ర గర్భ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇక డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయని తెలిపారు.
అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్‌ట్రా ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తున్నామ‌ని చెప్పారు బికాస్ కోలే. ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదుగుతున్న ఈ ప్రాంతానికి టెక్ ఫ్యూచర్ ను అందించేలా ఈ డేటా సెంటర్ ఉంటుందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ భద్రత, ఇంధన భద్రత, నీటి వినియోగం లాంటి అంశాలతో స్థానిక భాగస్వామ్యంతో ముందుకు అడుగులు వేస్తామ‌ని చెప్పారు. యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్ డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలు కూడా గూగుల్ నిర్వహిస్తుందని వెల్ల‌డించారు. 10 వేల మందికి పైగా మహిళలకు మైక్రో ఎంట్రప్రైజ్ గా మారేందుకు కూడా సహకారం అందిస్తుందన్నారు.
న్యూ ట్రాన్స్ మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్ లాంటివి ఈ ప్రాంతానికి ఇంధన భద్రతను కల్పిస్తాయ‌ని తెలిపారు. విశాఖలోని వివిధ నివాస ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ ప్రాంతానికి ఆర్ధిక స్థిరత్వం కల్పించేలా ఈ డేటా సెంటర్ నిర్మితం అవుతుందన్నారు.
The post ఏఐ యుగంలో గూగుల్ డేటా సెంట‌ర్ కీల‌క పాత్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ప్రభుత్వం లక్ష్యంప్ర‌జా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం

ఖ‌మ్మం జిల్లా : ప్ర‌జా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. శుక్ర‌వారం పాలేరు నియోజక వర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, రాకాసి తండా, బంధంపల్లిలో

తిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభంతిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభం

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో

Ramachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులుRamachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు

Ramachandra Yadav : నక్కపల్లి బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల వద్దకు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను (Ramachandra Yadav) పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల