hyderabadupdates.com Gallery ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు post thumbnail image

శ్రీ సత్యసాయి జిల్లా : బాబుతోనే జాబు గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను జగన్ మోసం చేస్తే, టీచర్, పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి మంత్రి నారా లోకేశ్ మాట నిలబెట్టు కున్నారని కొనియాడారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటను నిలబెట్టు కుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం చేశామని, ఉగాది సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగుల శక్తి పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణం ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి సవిత అన్నారు.
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారని మంత్రి సవిత తెలిపారు. 10,060 ఉద్యోగాల భర్తీకి ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. ఇది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్తని అన్నారు.
The post ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాను డిఫ‌రెంట్ క‌థ‌తో ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , శ్రీ‌లీల‌తో

దేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయందేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం

తాడేపల్లి గూడెం : మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించు కునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని ధ్వజమెత్తారు. తిరుమల

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రంకోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని