hyderabadupdates.com movies ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ? అనే మాట వినిపించ‌డం స‌హ‌జం. ఉగాది రోజు కొత్త దుస్తులు ధ‌రించి.. ప‌చ్చ‌డి చేసుకుని తినడ‌మే క‌దా.. అనుకుంటే.. ఈ ఏడాది మాత్రం అలా ఉండ‌దు. కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగుల కార‌ణంగా.. ఈ ఏడాది ఉగాది చాలా స్పెష‌ల్ గురూ అని అన‌కుండా ఉండ‌లేదు.

దీనికి ప్ర‌ధానంగా 3 కార‌ణాలు ఉన్నాయి. 1) ఉగాది రోజు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లోనూ క‌లిపి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్‌ను విడుద‌ల చేసేందుకు మంత్రి నారా లోకేష్ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రెడీ అవుతున్నారు. దీనిలోనే డీఎస్సీ ప్ర‌క‌ట‌న కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు. సో.. ఈ ఉగాది నిరుద్యోగుల‌కు భారీ అవ‌కాశాల‌నే తీసుకు రానుంది.

2) టిడ్కో ఇళ్లు: ఈ ఉగాది సంద‌ర్భంగా రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల పైచిలుకు ల‌బ్ధిదారుల‌కు టిడ్కో ఇళ్ల‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి సంబంధించిన ప‌నులు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. గ‌త ఏడాది 3.5 ల‌క్ష‌ల మందికి టిడ్కో ఇళ్ల‌ను ఇచ్చారు. ఈ ద‌ఫా మ‌రో 2.5 ల‌క్ష‌ల మందికి ఈ ఇళ్ల‌ను అందించ‌నున్నారు. ఉగాది రోజు వారంద‌రితోనూ గృహ ప్ర‌వేశాలు చేయించాలని నిర్ణ‌యించుకున్నారు. సో.. ఇది సొంతింటి కోసం క‌ల‌లుకంటున్న వారికి మేలు చేసే ఉగాదిగా మార నుంది.

3) రాజ‌ధానిలో రెండో ద‌శ ప‌నుల‌కు శ్రీకారం: అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలో భాగంగా ప్ర‌స్తుతం తొలి ద‌శ ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. అయితే.. రెండో ద‌శ ప‌నుల‌ను కూడా ఉగాది నాడు ప్రారంభించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

తొలిద‌శ‌లో అధికారుల ఇళ్ల నిర్మాణం చేప‌ట్టారు. అదేవిధంగా శాశ్వ‌త హైకోర్టు నిర్మాణ ప‌నులు కూడా వేగంగా సాగుతున్నాయి. రెండో విడ‌త‌లో ప్ర‌ధాన రాజ‌ధాని ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నారు. త‌ద్వారా అమ‌రావ‌తికి వ‌చ్చే రెండేళ్ల‌లో స‌మ‌గ్ర‌రూపం ఇవ్వ‌నున్నారు. సో.. ఇలా ఈ ఏడాది ఉగాది.. ప్ర‌త్యేకంగా మార‌నుంది.

Related Post

పుష్పలో మిస్సయ్యింది కుటుంబంలో దొరికిందిపుష్పలో మిస్సయ్యింది కుటుంబంలో దొరికింది

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో వెనుకబడి ఉన్న నారా రోహిత్ ఆ మధ్య భైరవంలో చెప్పుకోదగ్గ పాత్ర చేశాడు కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. సుందరకాండలో హీరోగా ఒక డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తే అదీ ఆదరణకు