hyderabadupdates.com Gallery ఏపీలో కుట్ర‌ల‌కు బెంగ‌ళూరులో జ‌గ‌న్ ప్లాన్

ఏపీలో కుట్ర‌ల‌కు బెంగ‌ళూరులో జ‌గ‌న్ ప్లాన్

ఏపీలో కుట్ర‌ల‌కు బెంగ‌ళూరులో జ‌గ‌న్ ప్లాన్ post thumbnail image

అమ‌రావ‌తి : తెలుగుదేశం పొలిట్ బ్యూరో స‌భ్యుడు , మాజీ స్పీక‌ర్ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బెంగ‌ళూరులో మ‌కాం వేసిన జ‌గ‌న్ అక్క‌డి నుంచే ఏపీలో కుట్ర‌ల‌కు తెర లేపాడాంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కుట్రల అమలుకు బెంగళూరులో బ్యాక్ ఆఫీస్ పెట్టారంటూ మండిప‌డ్డారు. అవినీతి కార్యకలాపాలకు బెంగళూరు ప్యాలెస్సునే కేంద్రంగా చేసుకున్నారంటూ జగన్ పై ఆరోపణలు చేశారు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. త‌ను అక్క‌డే మకాం వేయ‌డంపై ప‌లు అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చెప్పారు.
తన అవినీతి సంపదను జగన్ బెంగళూరు ప్యాలెస్సుకు తరలించారని ఫైర్ అయ్యారు. వాటిని ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయాల‌ని డిమాండ్ చేశారు. అస‌లు బెంగళూరు జగన్ జన్మస్థలం కాదని, పోనీ సొంత నియోజకవర్గం కానే కాదన్నారు. అయినా అక్క‌డే ఎందుకు ఉంటున్నారంటూ ప్ర‌శ్నించారు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కాదు… కనీసం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం కాదు… అలాంటప్పుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్సులో ఎందుకు మకాం వేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగి పోయాయ‌ని అన్నారు.
ఏడీఆర్ తాజా రిపోర్ట్ ప్రకారం జగన్ సహా వివిధ వైసీపీ కీలక నేతల ఆస్తులు ఉన్నట్టుండి 600 శాతం మేర పెరిగాయ‌ని తెలిపింద‌ని చెప్పారు. ఆయ‌న ఏం ఉద్ద‌రించార‌ని ఇలా ఆస్తులు పెరిగాయో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జగన్, వైసీపీ నేతలు నియో రిచ్ క్లబ్ నుంచి వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ లో చేరుతున్నారని , వీరంద‌రిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు.
The post ఏపీలో కుట్ర‌ల‌కు బెంగ‌ళూరులో జ‌గ‌న్ ప్లాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీMadhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ (BJP) ఎంపీ గణేష్ సింగ్ (MP Ganesh Singh) అందరూ

భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్

కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టును అభినందించారు. ఇదే స‌మ‌యంలో త‌మ కేర‌ళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీబీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై