hyderabadupdates.com movies ఏపీలో కొత్తగా 11,753 ఉద్యోగ అవకాశాలు..

ఏపీలో కొత్తగా 11,753 ఉద్యోగ అవకాశాలు..

ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది.

పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

దీంతో ఇప్పటి వరకు రూ.8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో 14 సంస్థలకు చెందిన రూ. 19,391 కోట్ల పెట్టుబడులు, 11,753 ఉద్యోగ అవకాశాలకు ఆమోదం లభించింది. ఆమోదించిన పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలివే..

– ఆర్ణ కోస్టల్ రిసార్ట్స్-బాపట్ల జిల్లా-రూ. 187.58 కోట్లు-250 ఉద్యోగాలు– సైవెన్, యూనిఫై కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 183.87 కోట్లు-196 ఉద్యోగాలు– శుభం, ఇంద్రనీర్ కన్సార్షియం-బాపట్ల జిల్లా-రూ. 64.44 కోట్లు-100 ఉద్యోగాలు– ఇస్కాన్-సత్యసాయి జిల్లా- రూ. 425.20 కోట్లు-1035 ఉద్యోగాలు– సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్-అనంత జిల్లా -రూ. 200.82 కోట్లు-245 ఉద్యోగాలు– నవ ఫుడ్ సెంటర్-తిరుపతి జిల్లా- రూ. 44.42 కోట్లు-500 ఉద్యోగాలు– వెబ్ సోల్ రెన్యూవబుల్-నాయుడుపేట-రూ. 3538 కోట్లు-1980 ఉద్యోగాలు– టాటా పవర్-నెల్లూరు జిల్లా-రూ. 6675 కోట్లు-1000 ఉద్యోగాలు– రామ్ కో సిమెంట్స్- నంద్యాల జిల్లా-రూ. 1500 కోట్లు-300 ఉద్యోగాలు– షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ -కడప జిల్లా-రూ. 5571 కోట్లు-5000 ఉద్యోగాలు– ఎథిరియల్ ఎక్స్ ప్లోరేషన్ గిల్డ్-తిరుపతి జిల్లా-రూ. 578 కోట్లు-382 ఉద్యోగాలు– పయనీర్ క్లీన్ యాంప్స్-చిత్తూరు జిల్లా-రూ. 159 కోట్లు-600 ఉద్యోగాలు– రాధికా వెజిటబుల్స్ ఆయిల్స్ -విజయనగరం జిల్లా-రూ. 234 కోట్లు-165 ఉద్యోగాలు– రిలయెన్స్ కన్స్యూమర్స్-అనకాపల్లి జిల్లా- రూ. 30 కోట్లు.

Related Post

ప్రపంచంలోనే ఎత్తైన రాముడు… మోదీ గ్రాండ్ ఎంట్రీ!ప్రపంచంలోనే ఎత్తైన రాముడు… మోదీ గ్రాండ్ ఎంట్రీ!

గోవా వేదికగా మరో ఆధ్యాత్మిక అద్భుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దక్షిణ గోవాలోని ప్రసిద్ధ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన ఈ 77 అడుగుల కాంస్య

Is Samantha Ruth Prabhu making a comeback to Tamil cinema in Simbu’s Arasan with Vetrimaaran?Is Samantha Ruth Prabhu making a comeback to Tamil cinema in Simbu’s Arasan with Vetrimaaran?

For those unaware, Samantha’s last appearance in a Tamil film was Kaathuvaakula Rendu Kaadhal (2022), where she starred alongside Vijay Sethupathi and Nayanthara. Directed by Vignesh Shivan, the romantic comedy