hyderabadupdates.com Gallery ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషి

ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషి

ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషి post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ , సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. చీరాల మండలం, అక్కయిపాలెం గ్రామపంచాయతీ, రామాపురం, పాండురంగా బీచ్ నందు జిల్లా కలెక్టర్, చీరాల ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమామహేశ్వరరావు, బాపట్ల పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ శలగల రాజశేఖర్ తో కలసి జెట్ స్కీ రైడర్స్, విహంగ్ అడ్వెంచర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అభివృద్ధి చేసే అధికారులకు స్థానికులు సహ‌క‌రించాల‌ని కోరారు. అధికారులు స్థానికుల ఆచారాలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. టూరిజంలో లక్షల పెట్టుబడి, ఉపాధి అవకాశం ఉందన్నారు. టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. టూరిజం అభివృద్ధికి అన్నీ పరిమితులను వెంటనే ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గతంలో వ్యాపారం చేసే సౌలభ్యం ఉండేదని, ఇప్పుడు వ్యాపారం వేగవంతం చేసే పరిస్థితులు ఉన్నాయని మంత్రి తెలిపారు. కొన్ని దేశాలు కేవలం టూరిజం పై వచ్చే ఆదాయంతో మునుగ‌డ‌ జరుగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా టూరిజంను అభివృద్ధి పరచాలన్నారు. సముద్ర తీర ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ప్రపంచమంతా తెలుసునని ఆయన చెప్పారు. అటువంటి వాటికి తావు లేకుండా స్థానికులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రక్షణ విషయంలో టూరిస్టులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికులు టూరిస్టులను మోసగించకుండా, వారికి అనుకూలంగా, స్నేహ పూర్వకంగా వారితో మెలిగినప్పుడు టూరిస్టులు ఎక్కువ మంది వచ్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో రిసార్ట్లు ఎక్కువ అవటం, వ్యాపారం పెరగటం, ఆదాయం పెరగటం, ఉపాధి అవకాశాలు పెరగటం జరుగుతుందన్నారు.
The post ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డిప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం యుద్దం జ‌రుగుతున్న క్ర‌మంలో ప్ర‌వాస భార‌తీయుల ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్ర‌ధాన‌మంత్రి

సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడుసంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు

కోల్ క‌తా : భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో టీం ఇండియా వెస్టిండీస్ పై 5

వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్

అమ‌రావ‌తి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మ‌న్ బిల్ గేట్స్ సోమ‌వారం ఏపీ రాష్ట్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రుల‌తో సంభాషించారు.