hyderabadupdates.com Gallery ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం

ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం

ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి :  సీఎం post thumbnail image

అమరావతి : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేసిందన్నారు సీఎం.
వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం వాటి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించు కున్నందుకు అధికారులను అభినందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమరావతి రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్‌లు నిర్మాణం అవుతున్నాయని..వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాలా ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. అన్ని సవాళ్ళను అధిగమించి… కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
The post ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యంస్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం

కుప్పం : స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు పలు

ఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులుఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు

నిర్మ‌ల్ జిల్లా : ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు ఇక శ‌ర‌వేగంగా కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు సోమ‌వారం శంకుస్థాపన

ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదేఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ కు జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌. చివ‌ర‌కు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోటీ నెల‌కొంది. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ కీల‌క ప‌ద‌విని కైవ‌సం చేసుకోవ‌డం