hyderabadupdates.com movies ఏపీ కొత్త ఎమ్మెల్యేలు: ఒక్కొక్క‌రు ఒక్కోలా …!

ఏపీ కొత్త ఎమ్మెల్యేలు: ఒక్కొక్క‌రు ఒక్కోలా …!

రాష్ట్రంలో కొత్త ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది? వారు.. ప్ర‌జ‌ల‌కు ఏమేర‌కు చేరువ అవుతున్నారు? .. ఈ ప్ర‌శ్న‌లు ఎవ‌రో.. ప్ర‌త్య‌ర్థులు అడుగున్న‌వి కాదు. సాక్షాత్తూ వారికి టికెట్ ఇచ్చి.. వారు గెలిచేలా ప్రోత్స‌హించి, ప్ర‌చారం చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ‌స్తున్న డౌట్లు. ఈ క్ర‌మంలోనే కొత్త‌వారిని దారిలో పెట్టాల్సిన బాధ్య‌త‌ను వారిని స‌రైన విధంగా ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల్సిన బాధ్య‌త‌ను కూడా ఇంచార్జ్ మంత్రుల‌కు అప్ప‌గించారు. అయితే.. వారు ఈ బాధ్య‌తల విష‌యంలో విముఖత వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబే రంగంలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు కొత్త‌వారి ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యంపై ఆరా తీస్తున్నారు. ఐవీఆర్ఎస్ స‌హా.. పార్టీ కీల‌క వ‌ర్గాల నుంచి చంద్ర‌బాబు స‌మాచారం తెప్పించుకుంటున్నారు. ఈ ప్ర‌క్రియ ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. అయితే.. తాజాగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు.. కొత్త ఎమ్మెల్యేల వైఖ‌రి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంద‌ని తెలిసింది.

కొంద‌రు పార్టీ అధినేత చెప్పిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు చేరువ అవుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. వీరి సంఖ్య ఆశించిన రీతిలో లేద‌ని పార్టీ భావిస్తోంది. మొత్తం 60 మందికి పైగా కొత్త నేత‌లు విజ‌యం ద‌క్కించుకుంటే.. వీరిలో 20 శాతం మంది మాత్ర‌మే ప్ర‌జ‌లకు చేరువ‌గా ఉంటున్నార‌ని స‌మాచారం.

మ‌రో 80 శాతం మందిలో 20 శాతం మంది.. అటు ఇటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీ కార్యాల‌యానికి నివేదిక చేరిన‌ట్టు తెలిసింది. వీరిలో కొంద‌రు పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ.. ఎక్కువ స‌మ‌యంలో సొంత వ్యాపారాల‌కు కేటాయిస్తున్నారు. అంటే.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చిన‌ట్టు చెబుతూ.. ఆ త‌ర్వాత‌.. వారి సొంత వ్య‌వ‌హారాల‌కు ప‌రిమితం అవుతున్నారు. మ‌రో 30 శాతం మంది అసలు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేద‌ని స‌మాచారం. ఇంకొంద‌రు.. అంటే.. 10 శాతం మేర‌కు నాయ‌కులు వైసీపీ నేత‌ల‌తో క‌లివిడిగా ఉన్న‌ట్టు తెలిసింది. ఇలా.. కొత్త‌ నేత‌లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నార‌న్న‌ది పార్టీ వ‌ర్గాల‌కు అందిన స‌మాచారం.

Related Post

కేటీఆర్ నోట ‘తుగ్లక్ సీఎం’ మాటకేటీఆర్ నోట ‘తుగ్లక్ సీఎం’ మాట

సికింద్రాబాద్‌ను మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో విలీనం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డిమాండ్ సాధనకు శాంతి ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్

బాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగాబాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగా

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ‌-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి స్పంద‌న తెచ్చుకోవ‌డంతో అఖండ‌-2ను బ‌హు భాష‌ల్లో చిత్రీక‌రించి, దేశ‌వ్యాప్తంగా ప్ర‌మోట్ చేసింది చిత్ర బృందం. ఇందులోని కంటెంట్  పాన్ ఇండియా

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2014లో పవన్ కల్యాణ్ రాజకీయాలను విమర్శిస్తూ ఆయన రాసిన పుస్తకం