అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. నూతన బడ్జెట్ లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. 2026-27 బడ్జెట్ లో రూ.51,021 కోట్లు బీసీ సంక్షేమానికి కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి పయ్యావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. 2026-27 బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలమైనదన్నారు. ముఖ్యంగా బీసీల ఉన్నతికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 2024-25 బడ్జెట్ లో రూ.39,007 కోట్లు, 2025-26 బడ్జెట్ 47,456 కోట్లు, 2026-27 బడ్జెట్లో 51,021 కోట్లు కేటాయించారన్నారు.
అందులో ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి రూ.10,669 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు సవిత. 2025-26లో రూ.10,614 కోట్లు, 2024-25లో రూ.10,273.80కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నూతన బడ్జెట్‌లోనూ ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1000 కోట్లు, చేనేతలకు, సెల్లూన్లకు ఉచిత విద్యుత్ కోసం రూ.150 కోట్లు, రూ.50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఇలా ఏటా బీసీ సంక్షేమానికి నిధులు కూటమి ప్రభుత్వం కేటాయింపులు పెంచుతూ వస్తోందన్నారు. చరిత్రలో ఎరుగని విధంగా, సింహ భాగం నిధులు బీసీల సంక్షేమానికి కేటాయించినట్లు చెప్పారు మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటువంటి కేటాయింపులు చేయలేదన్నారు. రాయలసీమ ను గ్లోబల్ హార్టీ కల్చర్ గా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా బడ్జెట్ ను రూపకల్పన చేశామన్నారు. వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు,
The post ఏపీ బడ్జెట్ లో బీసీల అభ్యున్నతికి ప్రయారిటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఏపీ బడ్జెట్ లో బీసీల అభ్యున్నతికి ప్రయారిటీ
Categories: