అమరావతి : మంత్రి నారా లోకేష్ కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. ఆయన కృషి వల్ల ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లకు మన రాష్ట్రంపై గట్టి నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కంపెనీలను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. గతంలో డావోస్ పర్యటనలు కేవలం ఫోటో షూట్లకే పరిమితమయ్యేవని అన్నారు. కానీ లోకేష్ బాబు పర్యటన వల్ల RMZ వంటి సంస్థలు విశాఖలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గ్లోబల్ క్యాపబిలిటీ పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని తెలిపారు. మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తున్న లోకేష్ బాబు, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే భవిష్యత్తు నాయకుడని ఆకాంక్షించారు.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో పర్యటించి అక్కడి దిగ్గజ కంపెనీలతో మాట్లాడారని తెలిపారు.
ఫలితంగానే కాగ్నిజెంట్, డేటా సెంటర్లు వంటివి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. అమరావతిని కేవలం రాజధానిగానే కాకుండా, భవిష్యత్ తరాల కోసం ‘క్వాంటం వ్యాలీ’ గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు పల్లా శ్రీనివాస రావు. ఇక్కడ కేవలం ఉద్యోగాలే కాదు, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యం కూడా యువతకు అందుతాయని అన్నారు. గతంలో అందరూ పనులు సులభంగా అవ్వాలని (Ease of Doing Business) అనేవారు. కానీ లోకేష్ బాబు ఒక అడుగు ముందుకు వేసి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే నినాదంతో పనులను వేగవంతం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) విషయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా, వెంటనే చెల్లించేలా ‘ఎస్క్రో అకౌంట్లు’ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచారని చెప్పారు.
కేవలం ఐటీ మాత్రమే కాదు, ఆర్సిలర్ మిట్టల్ వంటి స్టీల్ దిగ్గజం 2000 ఎకరాల్లో భారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆశయం ప్రకారం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని అన్నారు. ఒక పెద్ద కంపెనీ వస్తే దాని చుట్టూ వందలాది చిన్న అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు, తద్వారా స్థానికులకు విపరీతమైన అవకాశాలు దక్కుతాయని చెప్పారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచడం (వికేంద్రీకరణ), యువతకు నైపుణ్యాన్ని అందించడం, పారిశ్రామిక వేగంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే లోకేష్ బాబు లక్ష్యమన్నారు.
The post ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్న నారా లోకేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్న నారా లోకేష్
Categories: