hyderabadupdates.com Gallery ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ

ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ

ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ post thumbnail image

దావోస్ : దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు 2026లో పాల్గొన్నారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు, తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోని టాప్ కంపెనీల‌కు చెందిన ప్ర‌తినిధులు, సీఈవోలు, పెట్టుబ‌డిదారులు, కార్పొరేట్ కంపెనీల దిగ్గ‌జాల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ దిగ్గ‌జ సంస్థ టాటా గ్రూప్ సన్స్ చ‌ర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ మ‌ర్యాద పూర్వ‌కంగా స‌మావేశం అయ్యారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో.
విశాఖలో టిసిఎస్ డెవల్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటం వాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఈ ఇద్ద‌రూ చ‌ర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి చ‌ర్చించారు., టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి దీనిపై చర్చిద్దామని చెప్పారు చంద్ర‌శేఖ‌రన్. రాష్ట్రంలో టాటా గ్రూపు చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అన్నిటినీ సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామన్నారు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ .
The post ఏపీ సీఎంతో టాటా స‌న్స్ చైర్మ‌న్ భేటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారుపూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తాజా మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. శుక్ర‌వారం ఇందుకు గాను అధికారికంగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలిపారు. త‌మిళ చ‌ల‌న చిత్ర