hyderabadupdates.com Gallery ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. ఇవాళ స‌చివాల‌యంలో కీల‌క మంత్రివ‌ర్గం స‌మావేశం నిర్వ‌హించారు. త‌న అధ్యక్ష‌త‌న జ‌రిగిన ఈ కీల‌క భేటీలో ప‌లు ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌తో పాటు మంత్రులు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, ప‌య్యావుల కేశ‌వ్, కింజ‌రాపు అచ్చెన్నాయుడు, వంగ‌ల‌పూడి అనిత‌, గొట్టిపాటి ర‌వికుమార్, కొలుసు పార్థ‌సార‌థి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్ , నాదెండ్ల మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్, ఎస్. స‌విత‌, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. సీఎస్ ఆదిత్యానాథ్ తో పాటు ఆయా శాఖ‌ల‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు హుటా హుటిన దేశ రాజ‌ధాని ఢిల్లీకి ప్ర‌యాణం అయ్యారు.
ఆయ‌న ఇవాళ రాత్రి హ‌స్తిన‌లో మ‌కాం చేస్తారు. రేపు మంగ‌ళ‌వారం కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నిర్దేశించిన‌ షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ , కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సహా ఐదుగురు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరిగి వస్తారు.
The post ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లుశ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

తిరుపతి/ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా

న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగిందిన‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది

హైద‌రాబాద్ : 24 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి ప్ర‌త్యూష కేసుపై. మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌త్యూష కేసులో కీల‌క నిందితుడిగా ఉంటూ బెయిల్

గ‌త పాల‌కుల త‌ప్పిదాల‌ను స‌రిదిద్దుతున్నాంగ‌త పాల‌కుల త‌ప్పిదాల‌ను స‌రిదిద్దుతున్నాం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి పై భ‌గ్గుమ‌న్నారు. త‌న ఆధ్వ‌ర్యంలో ఏపీ వందేళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని ఆరోపించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. గత