hyderabadupdates.com movies ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆడిన వ్యూహంలో నియోజకవర్గాల పెంపు వాయిదా పడిపోయింది. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. అయితే జమ్మూకశ్మీర్ లో సీట్ల సంఖ్య పెంపు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు కుదరడం లేదు. పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు చేస్తే తప్పించి… రెండు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపు కుదిరేలా లేదు.

అయితే… కేంద్రం మొన్న ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ఆధారంగా సీట్లను పెంచితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 265 సీట్లకు పెరుగుతాయి. అదే సమయంలో 119 సీట్లున్న తెలంగాణలో 178కి సీట్ల సంఖ్య పెరుగుతుంది. అలా కాకుండా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే సీట్ట సంఖ్యను పెంచాల్సి వస్తే… 175 సీట్లున్న ఏపీలో 225,  119 సీట్లున్న తెలంగాణలో 153 సీట్లకు వాటి సంఖ్య పెరుగుతుంది. ఇక మహిళా కోటా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాల్సి వచ్చినా… తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఎతావతా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందనే చెప్పవచ్చు.

జనాభా లెక్కలతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజనకు గురైన ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని పునర్విభజన చట్టం చెబుతోంది. అయితే అంతకుముందుగానే జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ సీట్లను పెంచేశారు. దాని ఆధారంగా ఏపీ, తెలంగాణలోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలని దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలంటే… ఆర్టికల్ 170ని ఏపీ పునర్విభజన చట్టంలోని  సెక్షన్ 26కు అనుగుణంగా మార్చాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈలోగా 2026 జనాభా లెక్కల తుది జాబితా విడుదలైతే… దాని ద్వారా డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ లోనూ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలంటే… చట్ట సవరణ తప్పనిసరి. దీంతో ఎలా చూసినా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగడం ఖాయమేనని చెప్పక తప్పదు.

Related Post

జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత సంచలన ట్వీట్జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత సంచలన ట్వీట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ 24 వేల ఓట్ల‌కు పైగా తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ బాధ నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోక ముందే.. బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, జాగృతి అధ్య‌క్షురాలు క‌విత

Flood, Blood, and Mystery: Soori’s New Film Sparks BuzzFlood, Blood, and Mystery: Soori’s New Film Sparks Buzz

Mythri Movie Makers, one of India’s leading production houses known for delivering large-scale and content-driven films across languages, has officially announced its third Tamil project, tentatively titled #MythriTamil03. The film