hyderabadupdates.com Gallery ఏలూరు జిల్లాలో 500 ఎక‌రాల్లో కోకో సిటీ

ఏలూరు జిల్లాలో 500 ఎక‌రాల్లో కోకో సిటీ

ఏలూరు జిల్లాలో 500 ఎక‌రాల్లో కోకో సిటీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. వెంట‌నే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలని స్ప‌ష్టం చేశారు సీఎం. మామిడి, కోకో, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో అంతర్ పంటల సాగుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. అరటి ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ… ఎగుమతుల విషయంలో వెనకబడ్డామని అన్నారు. ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో పెద్దఎత్తున కుంకుమపువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
ఇందుకు సంబంధించి ఆక్వా సాగు వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్‌ను రైతులకే ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధం రంగాలకు సంబంధించి కేంద్ర పాలసీలకు అనుగుణంగా రాష్ట్ర పాలసీలు ఉండాలని చెప్పారు. కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించినట్టే మన పంటలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పలు ఫెస్టివల్స్ నిర్వహణకు ఆలోచన చేయాలని అన్నారు సీఎం. దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం అవుతుందన్నారు.
అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైల్ బోగీలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. హార్టీకల్చర్, ఆక్వాకు ఏపీ గమ్యస్థానంగా ఉందని అన్నారు. ఈ పంట, శాటిలైట్ సమాచారం ద్వారా దిగుబడి అంచనా వేసి, అందుకు అనుగుణంగా మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఫ్రూట్ కవర్లతో మామిడికి మంచి నాణ్యత-ధర వచ్చిందని, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటలకు ఈ విధానాన్ని అనుసరించేలా చూడాలని సీఎం చెప్పారు. ఫుడ్ క్లస్టర్ల వారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థలు త్వరితగతిన నెలకొల్పేలా సంప్రదింపులు జరపాలన్నారు. త్వరలో మామిడి ప్రాసెసింగ్ యజమానులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు పరిష్కరిద్దామని సీఎం చెప్పారు.
The post ఏలూరు జిల్లాలో 500 ఎక‌రాల్లో కోకో సిటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదంTG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

    జీహెచ్‌ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న

విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!

వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌లో ‘త్రిబాణధారి బార్బరిక్’ మరియు ‘బ్యూటీ’ వంటి సినిమాలు విజయవంతంగా రీల్‌లో వచ్చాయి. విభిన్న కథలతో సినిమా పరిశ్రమలో కొత్త ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా Vijay Pal Reddy అడుగుపెట్టారు. ఇప్పుడెన్నో విజయాల తర్వాత, ఆయన మరోసారి

దేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయందేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం

తాడేపల్లి గూడెం : మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించు కునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని ధ్వజమెత్తారు. తిరుమల