hyderabadupdates.com movies ఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందా

ఐబొమ్మ రవి మారిపోతే… పైరసీ ఆగిపోతుందా

వారం రోజులుగా కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి వీలైనన్ని నిజాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో కొంచెం బెట్టు చేసినా ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. పలు కీలక వివరాలు వెల్లడిస్తూ ఎక్కడెక్కడ తన నెట్ వర్క్ ఉందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నట్టు సమాచారం. వాటిని ట్రేస్ చేసే పనిలో డిపార్ట్ మెంట్ బిజీగా ఉందట. తాను బయటికి వచ్చిన తర్వాత పైరసీ జోలికి వెళ్లనని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉద్యోగం చేసుకుంటానని చెబుతున్నాడట. అతను అడిగినంత మాత్రాన ఇది తేలికగా అయిపోయే వ్యవహారం కాదు.

ఐబొమ్మ రవి మారినా మారకపోయినా ఇప్పటికిప్పుడు పైరసీని పూర్తిగా నాశనం చేయడం కష్టం. మాజీ కమీషనర్ సివి ఆనంద్ చెప్పినట్టు ఏదో ఒక రూపంలో అది మళ్ళీ పురుడు పోసుకుంటుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న పైరసీ మొత్తం రవి సృష్టించలేదు. అందులో తానొక భాగమై కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐబొమ్మ మూతబడింది కానీ భారతీయ సినీపరిశ్రమకు శనిలా దాపురించినా కొన్ని వెబ్ సైట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సినిమాల ప్రింట్లు పెడుతూనే ఉన్నాయి. మరి రవి లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఆగిపోవాలి కదా. వేరే దొంగలు ఇంకా సేఫ్ గా ఉన్నారు.

జనాలు ఉచితంగా పైరసీ చూసే ప్రహసనానికి మాత్రమే ప్రస్తుతం అడ్డుకట్ట పడింది. ఇది థియేటర్ వ్యవస్థకు చాలా మేలు చేసిన మాట వాస్తవం. అయితే చదువుకున్న వాళ్ళు వాడే టొరెంట్స్, టెలిగ్రామ్ ఛానల్స్ లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వీటి వెనుక ఉన్న అసలు బాస్ ఎవరో పట్టుకోవాలి. అయితే ఇది సులభం కాదు. ప్రాక్సీ సర్వర్లు వాడుతూ, లొకేషన్లను పట్టుబడకుండా సరికొత్త టెక్నాలజీలు వాడే ఇంటెలిజెంట్ క్రిమినల్స్ ని జైల్లో వేయడం మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. రవి అరెస్టుతో ప్రారంభమైతే అదిరిపోయింది. దీన్ని క్లైమాక్స్ దాకా తీసుకెళ్లడమే మిగిలింది.

Related Post

మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం? సాధ్యమేనా?మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం? సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య

బుచ్చిబాబు మీద బాలీవుడ్ కన్నుబుచ్చిబాబు మీద బాలీవుడ్ కన్ను

తెలుగు తమిళంలో ఎవరైనా దర్శకులు బ్లాక్ బస్టర్లు కొట్టినా, ఫేమ్ తెచ్చుకున్నా ఆటోమేటిక్ గా బాలీవుడ్ కళ్ళలో పడటం సహజం. లేదంటే అట్లీతో షారుఖ్ ఖాన్ జవాన్ సాధ్యమయ్యేది కాదు. సుజిత్ ఒప్పుకోలేదు కానీ లేదంటే ఈ అవకాశం ఓజి కన్నా

క్రేజీ కాంబో 45కి సౌండ్ లేదేంటిక్రేజీ కాంబో 45కి సౌండ్ లేదేంటి

శివరాజ్ కుమార్ కన్నడలో సీనియర్ స్టార్ హీరో అయినప్పటికీ మనకు ఎక్కువ కనెక్ట్ కావడం మొదలయ్యింది జైలర్ తర్వాతే. రామ్ చరణ్ పెద్దిలో ఎప్పుడైతే గౌర్ నాయుడుగా ఒక ముఖ్యమైన పాత్ర దక్కించుకున్నారో అప్పటి నుంచి మరింత దగ్గరైన ఫీలింగ్ అభిమానుల్లో