hyderabadupdates.com movies ఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి వస్తుంది

ఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి వస్తుంది

బంగాళాఖాతంలో వాతావరణం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. అరుదైన తుఫాను ‘సెన్యార్’ ముప్పు మన దేశానికి తప్పింది అనుకునేలోపే, మరో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. రాబోయే 12 గంటల్లో ఇది కచ్చితంగా తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ IMD లేటెస్ట్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఒకవేళ ఇది తుఫానుగా మారితే దానికి ‘దిత్వ’ అని పేరు పెట్టనున్నారు.

ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంక తీరానికి దగ్గరలో ఉంది. ఇది నెమ్మదిగా ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావం కేవలం తమిళనాడుకే పరిమితం కాదు, దక్షిణ కోస్తా ఆంధ్రాపై కూడా గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. వచ్చే 48 గంటల్లో ఇది తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉండటంతో రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇప్పటికే చెన్నైతో పాటు నాగపట్నం, తిరువళ్లూరు, తంజావూరు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను ఐఎండీ జారీ చేసింది. నవంబర్ 28, 29 తేదీల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ‘దిత్వ’ తుఫానుగా మారాక గాలుల వేగం పెరిగితే, తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది.

ఇదిలా ఉంటే, దీనికి ముందు ఏర్పడిన ‘సెన్యార్’ తుఫాను వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరిచింది. మలేషియా, ఇండోనేషియా మధ్య ఉన్న మలక్కా జలసంధిలో తుఫాను ఏర్పడటం చరిత్రలో ఇదే తొలిసారి అని, అందుకే దీన్ని “రేరెస్ట్ ఆఫ్ రేర్” తుఫానుగా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా అక్కడ తుఫానులు పుట్టవు. అదృష్టవశాత్తూ ఈ సెన్యార్ భారత తీరానికి దూరంగా, మలేషియా వైపు వెళ్లిపోవడంతో మనకు పెను ప్రమాదం తప్పింది.

ఒకే సమయంలో రెండు వేర్వేరు సిస్టమ్స్ యాక్టివ్‌గా ఉండటం, అందులోనూ ఒకటి అత్యంత అరుదైన ప్రాంతంలో పుట్టడం చూస్తుంటే వాతావరణ మార్పులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. ‘సెన్యార్’ వెళ్లిపోయినా, ఇప్పుడు ‘దిత్వ’ రూపంలో వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి. రాబోయే రెండు, మూడు రోజులు వాతావరణంపై కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం.

Related Post

కల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారుకల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు

నవంబర్ 14 విడుదల కాబోతున్న శివ రీ రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ముప్పై నలభై ఏళ్ళ క్రితం వచ్చిన పాత సినిమాల రీ మాస్టరింగ్ ప్రింట్లు ఈ మధ్య కాలంలో మూవీ లవర్స్ ని నిరాశ