hyderabadupdates.com Gallery ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకున్న అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్వంత స్థ‌లం ముంబైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ కం ల‌భించింది. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున త‌న‌కు ఘ‌నంగా స‌న్మానం చేశారు. కెప్టెన్ మీడియాతో మాట్లాడాడు. ఇది స‌మిష్టి విజ‌యం అని పేర్కొన్నాడు. ఇంత కాలం టోర్నీపై ఫోక‌స్ పెట్టామ‌ని, కుటుంబాల‌కు దూరంగా ఉన్నామ‌ని తెలిపాడు. వరుసగా ట్రోఫీలు గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు సూర్య కుమార్ యాద‌వ్. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, 2026లో మన గడ్డపై ట్రోఫీ గెలిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాం అని తెలిపాడు.
పొట్టి ఫార్మాట్ లో ఎవ‌రూ ఊహించ లేదు తాము గెలుస్తామ‌ని అని అన్నాడు. కానీ త‌మ జ‌ట్టు అన్ని రంగాల‌లో డామినేట్ చేస్తూ వ‌చ్చింద‌న్నాడు. జ‌ట్టు ప‌రంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు స‌హ‌కారం అందించార‌ని చెప్పాడు. ఇదే స‌మ‌యంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. త‌ను క‌మ్ బ్యాక్ అయిన విధానం సూప‌ర్ అని పేర్కొన్నాడు. విండీస్, ఇంగ్లండ్, ఫైన‌ల్ లో న్యూజిలాండ్ తో త‌ను అద్బుతంగా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడ‌ని, త‌న‌తో పాటు బుమ్రా కీల‌క‌మైన భూమిక పోషించాడ‌ని ప్ర‌శంసించాడు సూర్య కుమార్ యాద‌వ్.
త‌మ‌మ‌ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున స్వర్ణం గెలవడం మాత్ర‌మే మిగిలి ఉంద‌న్నాడు . భారత క్రికెట్ జట్టు మంచి జోరులో ఉందని, భవిష్యత్తులో భారతదేశం తరఫున మరిన్ని ట్రోఫీలు గెలవడానికి ప్రయత్నిస్తాన‌ని చెప్పాడు కెప్టెన్.
The post ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

MK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీMK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీ

    తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అధికార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు

ద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలిద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్ప‌ష్టం చేశారు. సివిల్స్ ప‌రీక్ష‌ల‌తో పాటు గ్రూప్ –1,

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలిజీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్