hyderabadupdates.com Gallery ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్ post thumbnail image

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ విద్యుత్ బ‌స్సుల త‌యారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అరుదైన రికార్డును న‌మోదు చేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి 3వ త్రైమాసికంలో ఏకంగా 385 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసింది. వాటిని డెలివ‌రీ చేసిన‌ట్లు సంస్థ ప్ర‌తినిధి మోహ‌న్ బాబు వెల్ల‌డించారు. దీని కార‌ణంగా మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ 663.60 కోట్లకు చేరుకుంద‌న్నారు. వార్షికంగా 29 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అదే సమయంలో వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం రూ 97.10 కోట్లుగా నమోదై ఉంద‌న్నారు. గత ఏడాదితో పోలిస్తే 19 శాతం వృద్ధిని సాధించిందన్నారు. మెరుగైన ఆపరేషనల్ సామర్థ్యం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయ‌ని తెలిపారు. ఈ త్రైమాసికంలో పన్నుల ముందు లాభం రూ 64.07 కోట్లుగా ఉండగా, నికర లాభం రూ 46.68 కోట్లుగా నమోదైంద‌ని తెలిపారు. ఒక్కో షేర్‌కు లాభం రూ 5.65 ఓలెక్ట్రా ప్రకటించిన‌ట్లు తెలిపారు.
ఈ త్రైమాసికంలో డెలివరీ చేసిన 385 ఎలక్ట్రిక్ వాహనాల్లో 24 ఎలక్ట్రిక్ టిప్పర్లు కూడా ఉండటం విశేషం. ఇది ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ టిప్పర్ల విభాగంలోనూ ఒలెక్ట్రా తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్నదని సూచిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 3,639 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసిన సంస్థ, ప్రస్తుతం 9,439 ఎలక్ట్రిక్ వాహనాల బలమైన ఆర్డర్ బుక్‌తో రాబోయే త్రైమాసికాలకు గట్టి ఆదాయ అవకాశాలను కలిగి ఉంది. గడచిన తొమ్మిది నెలల కాలానికి సంబంధించి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది.
ఈ సమయంలో ఆదాయం రూ 1,667.45 కోట్లు నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం పెరిగింది. వడ్డీ, పన్నులు, తరుగుదల , రుణ విమోచనకు ముందు ఆదాయంరూ 246.08 కోట్లకు చేరుకొని 13 శాతం వృద్ధిని సాధించింది. పన్నుల ముందు లాభం రూ 166.33 కోట్లుగా ఉండగా, నికర లాభంరూ 122.14 కోట్లుగా నమోదై గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని చూపించింది. కార్యనిర్వహణ సామర్థ్యం, క్రమబద్ధమైన అమలుపై నిరంతర దృష్టి పెట్టడం వల్లే ఆదాయం, లాభాల్లో ఈ స్థాయి వృద్ధిని సాధించగలిగామని సంస్థ ఎండీ మ‌హేష్ బాబు పేర్కొన్నారు.
The post ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పుఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు

రాయ‌చూర్ జిల్లా : క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ జిల్లాలో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇప్ప‌టికే ఇరు వ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒక‌రు మృతి

బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఏఎంబీ థియేట‌ర్

హైద‌రాబాద్ : టాలీవుడ్ కు చెందిన ప‌లువురు న‌టులు విస్తృతంగా వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ఎవ‌రికి వారు వివిధ రంగాల‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తీస్తున్న వార‌ణాసిలో న‌టిస్తున్నాడు. త‌న‌తో

కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖకేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్ర స‌ర్కార్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ