hyderabadupdates.com movies ఓజీ భామ కొరియా యాత్ర

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూస్తే కన్యాకుమారిలో ఉండే ఒక అమ్మాయి కొరియా వెళ్లడమే తన లక్ష్యంగా పెట్టుకుంటుంది. చిన్నప్పుడు ఆమె ఆ వేషం వేసినప్పటి నుంచి ఆమె కొరియా వెళ్లాలనే కలలు కంటుంది.

తమిళ అమ్మాయి కొరియా వెళ్లే ప్రయత్నంలో ఏం జరిగింది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా కొరియా వెళ్లాలనుకుని కలలు కన్న ఆ అమ్మాయి అక్కడికి వెళ్లాక ఎదురైన పరిస్థితులు ఏంటి అన్నదే మేడిన్ కొరియా కథ. టీజర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ గా వస్తున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మాత్రం కాస్త బెటర్ గా ఉండాల్సిందనిపిస్తుంది.

ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో తన నటనతో ఆకట్టుకుంటున్న ప్రియాంక మోహన్ కెరీర్ లో మొదటిసారి ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా అటెంప్ట్ చేసింది. నీథం ఒరు వానం సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన RA కార్తీక్ ఓ పక్క మన కింగ్ నాగార్జునతో 100వ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసిందే. నాగార్జున సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్రియాంక మోహన్ తో మేడిన్ కొరియా సినిమా పూర్తి చేశాడు.

మేడిన్ కొరియా టీజర్ ఆసక్తికరంగానే ఉంది. తెలుగులో OG తో కణ్మనిగా ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక మోహన్ ఈ సినిమాతో OTT ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి కథానాయికకు సోలో సినిమా అంటే కథానాయికా ప్రాధాన్యతగా వచ్చే కథలు చేయాలనే కోరిక ఉంటుంది.

కొంతమందికి అవి కెరీర్ స్టార్టింగ్ లోనే వస్తాయి. ఐతే ఇప్పటికే కోలీవుడ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రియాంక ఈ టైంలో మేడ్ ఇన్ కొరియా లాంటి అటెంప్ట్ చేయడం ఆమె కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. 

Related Post

Padayaatra Update: Mammootty wraps shoot for Adoor Gopalakrishnan reunion filmPadayaatra Update: Mammootty wraps shoot for Adoor Gopalakrishnan reunion film

Padayaatra also includes roles by Sreeshma Chandran, Alencier Ley Lopez, Madhupal, Nandhu, Zeenath, and Professor Aliyar. Said to be about a Dr Devadas, played by Mammootty himself, the project will