hyderabadupdates.com movies ఓటిటిల మీద తొంబై రోజుల ప్రభావం ఉంటుందా

ఓటిటిల మీద తొంబై రోజుల ప్రభావం ఉంటుందా

తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు నిర్మాతల్లోనే కాదు వివిధ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతలు తొంభై రోజుల ముందే అప్లై చేసుకుని టికెట్ రేట్ల పెంపు తీసుకోవాలని తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఇదో సవాల్ గా మారనుంది.

ఎందుకంటే ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజా సాబ్ అయినా ప్యారడైజ్ అయినా అన్నింటిది ఒకే కథ. కొన్నిసార్లు జన నాయకుడు లాంటి వాటికి సెన్సార్ నుంచే వచ్చే ఇబ్బందులు బోనస్ చిక్కులు తెచ్చి పెడతాయి. అలాంటప్పుడు అంత అడ్వాన్స్ ప్లాన్డ్ ఉండటం అనుకున్నంత సులభం కాదు.

ఇక్కడ ఓటిటిల వైపు నుంచి సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అగ్రిమెంట్ చేసుకునే టైంలోనే నిర్మాత ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని స్పష్టంగా పేర్కొంటారు. దానికి అనుగుణంగానే ఓటిటిలు వాటి ప్రీమియర్లను షెడ్యూల్ చేసుకుంటాయి. అప్పుడప్పుడు మార్పులు ఉంటాయి. ఏదైనా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తితే తప్ప మినహాయింపులు ఉండవు.

అలాంటప్పుడు జిఓ కోసం నిర్మాతలు కనక మూడు నెలల ముందు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే దాన్నే ఓటిటి ఒప్పందాల్లో చూపించుకోవాలి. దానికి కట్టుబడకపోతే ఇటు ప్రభుత్వం, కోర్టు అటు ఓటిటిలతో కొత్త ఇబ్బంది వచ్చి పడుతుంది. నిర్మాతల ఆందోళన ఇదే.

ఇప్పటికిప్పుడు దీని గురించి ఎలాంటి కంక్లూజన్స్ కు రాలేం కానీ ఏదైనా ప్యాన్ ఇండియా మూవీ విడుదల దగ్గరలో ఉన్నప్పుడు వీటి తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. పెద్ది, ప్యారడైజ్ లాంటి బిగ్గీలతో పాటు టాక్సిక్ లాంటి డబ్బింగులు సైతం హైక్స్ కోరుకునేవే.

ఇదంతా ఒక రకమైన అయోమయానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు. టికెట్ రేట్ల మీద మళ్ళీ ఎవరు కోర్టుకి వెళ్లినా అంత సులభంగా అయితే తేలదు. ముప్పై రోజుల నిడివి ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ మూడు నెలలు మరీ ఎక్కువ గడవని, ప్రాక్టికల్ గా చూస్తే ఇది మీట్ కావడం కొందరికే సాధ్యమని ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు.

Related Post

మోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగిందిమోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగింది

ప్రపంచానికి పెద్దన్నగా.. సూపర్ పవర్ గా.. అగ్రరాజ్యంగా అమెరికాను అభివర్ణిస్తారు. అయితే.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్టు ర్యాంకులో మాత్రం అగ్రరాజ్యం టాప్ స్థానంలో ఉండటం తర్వాత.. టాప్ 5లో కూడా ఉండని పరిస్థితి. ఇంతకూ పాస్ పోర్టు పవర్

హిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగేహిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగే

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు అవకాశాలకు లోటు లేదు. ఆఫర్లు వస్తున్నాయి. ఏ ముహూర్తంలో దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఛాన్స్ ఇచ్చాడో కానీ అది డిజాస్టర్ అయినా సరే అమ్మడికి మాత్రం దశ తిరిగింది. పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు

లీకులు ఇస్తున్నారా వస్తున్నాయాలీకులు ఇస్తున్నారా వస్తున్నాయా

చిన్న సినిమాలకు ప్రమోషన్లు చాలా కీలకం. కాకపోతే దానికి సరిపడా బడ్జెట్ అందరి దగ్గరా ఉండదు. ఏదో ఒక వైరల్ కంటెంట్ క్రియేట్ చేయనిదే ఆడియన్స్ దృష్టిలో పడలేం. లిటిల్ హార్ట్స్ సక్సెస్ వెనుక మంచి పబ్లిసిటీ క్యాంపైన్ ఉంది. బన్నీ