హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల గెలుపు కోసం తాను గల్లీ గల్లీ కాదు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తానని అన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో లో 80 శాతం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సభ్యులు ఉన్నారని చెప్పారు. చట్ట సభల్లో బలం ఉందని మోదీ ప్రభుత్వం పేదల ను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెట్టి చాకిరి ని నిర్మూలించి,దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి, ఓటు హక్కు ఇచ్చింది మహాత్మా గాంధీ, అంబేద్కర్ అని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసిందని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేసిందన్నారు.రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ వ్యాప్తం గా తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారని చెప్పారు. అదానీ, అంబానీ కి దేశాన్ని అప్పగించే కుట్ర అమలు కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు.
ఓటు ప్రక్షాళన పేరుతో సర్ అనే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు సీఎం. సర్ పేరుతో పేదలు, మైనార్టీల ఓటు హక్కు ను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఓటు పోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతాయని వాపోయారు. ఇదంతా కేంద్రం కావాలని చేస్తున్న కుట్ర తప్ప మరోటి కాదన్నారు. దేశంలో ఉండాలా లేదా అన్నది బీజేపీ చేతిలో ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఓటు ప్రక్షాళన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తో పేదల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభానికి, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికగా మారాయని అన్నారు. అంబానీ, అదానీకి తక్కువ వేతనాలకు కూలీలను పంపించడానికే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తున్నారని వాపోయారు.
The post ఓటు ప్రక్షాళన వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఓటు ప్రక్షాళన వెనుక భారీ కుట్ర : రేవంత్ రెడ్డి
Categories: