ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.
ప్రకృతి వైపరీత్యాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు. అలాగే నిత్యకైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ యాగాన్ని చేస్తారని అర్చకులు తెలిపారు. ఈ యాగం ద్వారా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఇదిలా ఉండగా ఈసారి ఒంటిమిట్టలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో ధ్వజారోహణంతో ముగిశాయి. ఈ సందర్బంగా చేపట్టిన శ్రీ కోదండ రాముడి కళ్యాణోత్సవానికి రికార్డు స్తాయిలో భక్తులు హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు, కుటుంబీకులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సదాశివ రావు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post కమనీయం కడు రమణీయం పుష్ప యాగం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
కమనీయం కడు రమణీయం పుష్ప యాగం
Categories: