hyderabadupdates.com movies కమెడియన్ రెస్టారెంట్‌పై కాల్పులు.. ఇది మూడోసారి!

కమెడియన్ రెస్టారెంట్‌పై కాల్పులు.. ఇది మూడోసారి!

భారతీయ కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని రెస్టారెంట్‌పై కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ రెస్టారెంట్‌ను కేవలం నాలుగు నెలల్లో మూడోసారి టార్గెట్ చేశారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ తరహా ఘటనలు కెనడాలోని భారతీయ కమ్యూనిటీ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ దాడికి గోల్డీ ధిల్లాన్, కుల్దీప్ సింధు అనే గ్యాంగ్‌స్టర్లు తామే అని చెప్పుకున్నారు. తాజాగా జరిగిన దాడి తర్వాత గోల్డీ ధిల్లాన్ పేరుతో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌లో “మేము కప్స్ కేఫ్ (కపిల్ శర్మ రెస్టారెంట్) పై జరిగిన మూడు కాల్పులకు బాధ్యత వహిస్తున్నాం. సాధారణ ప్రజలతో మాకు శత్రుత్వం లేదు” అని హెచ్చరించారు. ఈ ఘటనతో రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లలో భయం నెలకొంది.

ఈ గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక కేవలం కెనడాకే పరిమితం కాలేదు. వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్‌షాట్‌లో, “నేను కపిల్ శర్మకు ఫోన్ చేశాను, కానీ అతను రెస్పాండ్ కాలేదు” అని ఉంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, “అతను ఇప్పటికీ రింగ్ వినకపోతే, తదుపరి చర్య ముంబైలో జరుగుతుంది” అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ బెదిరింపుతో భారతీయ సినీ పరిశ్రమ కూడా భయపడుతోంది.

కపిల్ శర్మ రెస్టారెంట్‌పై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. జూలై 10న జరిగిన మొదటి దాడిలో కొంతమంది ఉద్యోగులు లోపలే ఉన్నారు. ఆ తర్వాత ఆగస్టు 8న జరిగిన రెండో దాడిలో ఏకంగా 25 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు తెలిసింది. కేవలం నాలుగు నెలల్లో మూడుసార్లు ఒకే వ్యాపార సంస్థపై కాల్పులు జరగడంతో అలజడి మొదలైంది.

ఈ దాడి జరగడానికి కొద్ది రోజుల ముందు, కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఒక ‘టెర్రర్ ఎంటిటీ’ (ఉగ్ర సంస్థ)గా ప్రకటించింది. ఈ గ్యాంగ్ తమ దేశంలోని నిర్దిష్ట కమ్యూనిటీలను, ముఖ్యంగా ప్రో-ఖలిస్తాన్ అంశాలను టార్గెట్ చేస్తోందని కెనడా ప్రభుత్వం తెలిపింది. ఈ టెర్రర్ లిస్ట్‌లో చేర్చిన తర్వాత జరిగిన మొదటి దాడి ఇదే. కపిల్ శర్మపై జరిగిన ఈ దాడికి కారణం ఏమిటనే దానిపై స్పష్టత లేకపోయినా, ఈ సంఘటనతో కెనడాలో ఉన్న భారతీయ ప్రముఖులు ప్రవాస భారతీయుల భద్రతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ల ఈ తరహా బెదిరింపులను నియంత్రించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

Related Post

How to live better through adopting simple habits to boost health and happinessHow to live better through adopting simple habits to boost health and happiness

Boost your health and happiness with simple habits—like mindful meals and staying hydrated. Plus, explore how male toys can enhance your well-being effortlessly. The post How to live better through

Jolly LLB 3 VPF Controversy Fallout: PVR Inox To Be Investigated By CCI For Abusing Dominant PositionJolly LLB 3 VPF Controversy Fallout: PVR Inox To Be Investigated By CCI For Abusing Dominant Position

Following the recent VPF controversy surrounding Jolly LLB 3, the Competition Commission of India (CCI) has ordered an investigation into PVR Inox, the country’s largest multiplex chain, for allegedly abusing