hyderabadupdates.com movies కమెడియన్ సత్యకు దశ తిరిగింది

కమెడియన్ సత్యకు దశ తిరిగింది

ఒకప్పటిలా టాలీవుడ్ లో హాస్య నటుల స్వర్ణ యుగం లేదన్నది వాస్తవం. తొంభై దశకంలో బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జునరావు, ఏవిఎస్, భరణి లాంటి లెజండరీ యాక్టర్లు తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాలను నిలబెట్టిన దాఖలాలు వందలు కాదు వేలల్లో ఉన్నాయి. కానీ ఇప్పటి జనరేషన్ అలా లేదు.

ముగ్గురు నలుగురితోనే కామెడీ ట్రాక్స్ నడిపించే టాలెంట్ రచయితల్లో లేకపోవడంతో పాటు, హీరోలే నవ్వించే బాధ్యతను తీసుకోవడంతో ఎంటర్ టైన్మెంట్ డెఫినిషన్ మారిపోయింది. ఇలాంటి పరిస్థితిలో సత్య లాంటి కమెడియన్లు తమ ఉనికిని చాటుకోవడంలో ప్రత్యేక ముద్ర వేయడం దర్శకులకు బాగా ప్లస్ అవుతోంది.

మొన్న సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో సత్య ఉన్నాడు. రాజా సాబ్ లో ఉన్నది పరిమిత స్పేస్ అయినప్పటికీ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం వర్కౌట్ అయ్యింది. టైటిల్ కార్డు మొదలయ్యిందే సత్యతో. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఆశికా రంగనాథ్ అసిస్టెంట్ గా అతి వినయం ప్రదర్శించే పాత్రలో బాగా నవ్వించాడు.

నారి నారి నడుమ మురారిలో ఆటో డ్రైవర్ కనిపించేది తక్కువే అయినా నరేష్ తో పోటీపడి కొన్ని సీన్స్ లో హిలేరియస్ అనిపించాడు. ఇవాళ రిలీజ్ చేసిన కొరియన్ కనకరాజు టీజర్ ని హీరో వరుణ్ తేజ్ కన్నా ముందు సత్యతోనే ఓపెన్ చేయడం మేకర్స్ తనకిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.

ఇదే కాదు జెట్లీ టైటిల్ తో ఏకంగా ఒక కామెడీ యాక్షన్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు సత్య. తన పేరు మీదే బిజినెస్ జరిగిపోతోంది. గతంలో వివాహ భోజనంబులో హీరో నటించినప్పటికీ అది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడం వల్ల థియేటర్ ఆడియన్స్ కి రీచ్ కాలేదు. పైగా జెట్లీకు మంచి మార్కెటింగ్ చేస్తున్నారు.

షూటింగ్ స్టేజి నుంచే పబ్లిసిటీ జరిగిపోతోంది. మరీ అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ కరెక్ట్ గా ఫోకస్ చేస్తే బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ లాగా ప్రామిసింగ్ ఆర్టిస్టుగా మారిపోవచ్చు. అనిల్ రావిపూడి లాంటోళ్ళ చేతిలో పడితే మరింత సానబడే ఛాన్స్ ఉన్న సత్య మన శంకరవరప్రసాద్ గారుని మిస్ అయ్యాడు.

Related Post

‘వారణాసి’ విహారం : మైండ్ బ్లోయింగ్‘వారణాసి’ విహారం : మైండ్ బ్లోయింగ్

వెయ్యి కళ్ళతో మూవీ లవర్స్ ఎదురు చూసిన వారణాసి కాన్సెప్ట్ ట్రైలర్ ని గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. రాజమౌళి ముందే చెప్పినట్టు ఇందులో కథను పూర్తిగా ఓపెన్ చేయలేదు. కాకపోతే లోతుగా డీ కోడింగ్ చేసుకుంటే ఎంతో

Pinkvilla Recommendations: 5 must-watch South films on OTT to start 2026 with a bang: Salaar to KGF franchisePinkvilla Recommendations: 5 must-watch South films on OTT to start 2026 with a bang: Salaar to KGF franchise

Cast: Biju Menon, Prithviraj Sukumaran, Gowri Nandha, Anna Rajan, Ranjith, Anil Nedumangad, Anu Mohan, Sabumon Abdusamad Director: Sachy Genre: Action Thriller Language: Malayalam Runtime: 2 hours and 57 minutes Where