hyderabadupdates.com Gallery కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం

కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం

కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం post thumbnail image

హైదరాబాద్: నగరంలోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్, వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సౌతిండియన్ గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న సౌకర్యాలను పరిశీలించిన కేథరీన్ థెరీసా, సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల ప్రతి ఒక్కరూ లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. ప్రజలకు అందం, ఆరోగ్యం కలగాలంటే ఇలాంటి ఆధునిక కేంద్రాలు అవసరం అని పేర్కొన్నారు. ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ ద్వారా నాణ్యమైన సేవలను అత్యాధునిక టెక్నాలజీతో అందించడం అభినందనీయం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండేందుకు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరారు.
క‌ల‌ర్స్ హెల్త్‌కేర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ 2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ లక్షలాది మంది కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుంద‌ని అన్నారు. 22 సంవత్సరాల నుండి 52 బ్రాంచిలు పూర్తయ్యాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ 2.0గా రూపాంతరం చెందింద‌ని చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా హిమయత్‌నగర్ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంద‌న్నారు. హిమయత్‌నగర్ బ్రాంచ్‌ను ఆవిష్కరించిన కేథరీన్ థెరీసాకు కృతజ్ఞతలు తెలిపారు. 22 ఏళ్ల అనుభవం మాకు మరింత నమ్మకం ఇచ్చిందన్నారు. నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు ఈడీ. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నామ‌ని చెప్పారు.
5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజర‌య్యారు. కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
The post కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదుఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు

హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జ‌రిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిహారం అంద‌జేశారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు

సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారుసూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు

హైద‌రాబాద్ : లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బ‌తికే ఉంటార‌ని అన్నారు ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో

Bandaru Dattatreya’s `Alay Balay’ Held with Great pomp This year TooBandaru Dattatreya’s `Alay Balay’ Held with Great pomp This year Too

The “Alay Balay” festival, which is held every year to celebrate Dussehra, was held with great pomp this year too. The Alay Balay Foundation, under the auspices of former Governor Bandaru