hyderabadupdates.com movies కల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు

కల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు

నవంబర్ 14 విడుదల కాబోతున్న శివ రీ రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ముప్పై నలభై ఏళ్ళ క్రితం వచ్చిన పాత సినిమాల రీ మాస్టరింగ్ ప్రింట్లు ఈ మధ్య కాలంలో మూవీ లవర్స్ ని నిరాశ పరిచాయి. జగదేకవీరుడు అతిలోకసుందరికి మంచి వసూళ్లు వచ్చినా క్వాలిటీ విషయంలో అసంతృప్తి వ్యక్తమయ్యింది. ఆదిత్య 369 నెగటివ్ కస్టపడి దొరికించుకుంటే దాని నాణ్యత అంతంత మాత్రమే అనిపించింది. ఇంకా వెనక్కు వెళ్తే ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ అన్నింటిది ఒకే కథ. అందుకే శివ మీద అనుమానాలు లేకపోలేదు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ట్రైలర్ తో వాటిని బద్దలు కొట్టేసింది.

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, సందీప్ వంగా తదితరులతో  స్పెషల్ వీడియో బైట్స్ తీసుకుని ఆ తర్వాత అసలు కంటెంట్ ని రివీల్ చేశారు. 4కె రెజోల్యూషన్ చాలా స్పష్టంగా ఉండగా ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తాన్ని మళ్ళీ రీ రికార్డింగ్ చేసి డాల్బీ స్టీరియో మిక్స్ చేసిన విధానం థియేటర్లలో గొప్ప అనుభూతినివ్వడం ఖాయం. మాములుగా హాలీవుడ్ లోనే ఈ తరహా శ్రద్ధ తీసుకుంటారు కానీ ఈసారి నాగార్జున దగ్గరుండి మరీ తన కల్ట్ మూవీకి ఇంత గొప్ప ట్రీట్ మెంట్ ఇప్పించడం విశేషం.

మంచి టైమింగ్ చూసుకుని వస్తున్న శివ కొత్త జనరేషన్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనేది వేచి చూడాలి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అనే క్రియేటివ్ జీనీయస్ తొలి అడుగుగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్ అయినవాళ్లు ఎందరో ఉన్నారు. అంతగా శివలో ఏముందో తెలియాలంటే యూట్యూబ్ చూస్తే సరిపోదు. పెద్దతెరపై ఆస్వాదించాల్సిందే. నిజ జీవిత భాగస్వామి అమల హీరోయిన్ గా నటించిన శివలో రఘువరన్, నిర్మలమ్మ తప్ప ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు దాదాపు అందరూ అందుబాటులో ఉన్నారు. వాళ్లకు ఇప్పటి తరం ఎలా స్పందిస్తుందనే ఎగ్జైట్ మెంట్ ఖచ్చితంగా ఉంటుంది.

Related Post