హైదరాబాద్ : ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఓ ఐఏఎస్ మహిళా ఆఫీసర్ మధ్య ఏదో లింకు ఉందంటూ జుగుస్సాకరమైన రీతిలో కథనం ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఎపిసోడ్స్ లెక్కన యూట్యూబ్ ఛానల్స్ రెచ్చి పోయి మరిన్ని కథనాలు స్టార్ట్ చేశారు. అవి కూడా యూట్యూబ్ లో భారీ ఎత్తున వ్యూస్ సంపాదించుకున్నాయి. చివరకు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. దీనికి అధికారిగా నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను నియమించింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి. తనకు బాధ్యతలు అప్పగించిన వెంటనే రంగంలోకి దిగారు సీపీ సజ్జనార్. మహిళా ఇంటికి వెళ్లి తలుపులు కొట్టి అరెస్ట్ చేశారు.
దీంతో జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ లను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్, హరీశ్ రావు. కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ పై విడుదలైన జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ ,చారి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టులను కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయ లేదని అన్నారు.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెయ్యని తప్పుకు వర్కింగ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసిందని, ఆపై 24 గంటలు మానసిక క్షోభకు గురి చేయడం దారుణమని అన్నారు.
ఇదిలా ఉండగా తాను కేవలం వార్త చదివానని, ఏ వార్త వచ్చినా అది నేను చదువుతానని చెప్పింది మహిళా జర్నలిస్టు , యాంకర్ దేవి. ఇది నా వృత్తి ధర్మంలో భాగంగానే వచ్చిన వార్త అని పేర్కొంది. 3 గంటల పాటు నన్ను విచారించారని, నాకు ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఉన్నా సమాధానాలు చెప్పానని అన్నారు. నిన్న వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, అయినా మళ్లీ అర్ధరాత్రి నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. మా ఇంటికి వచ్చి, మా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టారని, తాము ఏమీ దొంగలం కామని అన్నారు.
The post కాంగ్రెస్ సర్కార్ కావాలని వేధిస్తోంది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
కాంగ్రెస్ సర్కార్ కావాలని వేధిస్తోంది
Categories: