hyderabadupdates.com movies కాంతార.. ఇక్కడ రికార్డ్.. అక్కడ లాస్

కాంతార.. ఇక్కడ రికార్డ్.. అక్కడ లాస్

మొత్తానికి ‘కాంతార: చాప్టర్-1’ సాధించింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ఈ కన్నడ సినిమా నిలుస్తుందా లేదా అనే సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు ‘కాంతార: చాప్టర్-1’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన బాలీవుడ్ మూవీ ‘ఛావా’ రూ.807 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. తర్వాత ఏ చిత్రమూ దాన్ని దాటలేకపోయింది. ‘సైయారా’ రూ.600 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ‘కూలీ’ రికార్డు సాధిస్తుందనుకుంటే దానికీ అది సాధ్యం కాలేదు. 

ఐతే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’.. ఆ అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టి రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 22వ రోజుకు కాంతార వసూళ్లు రూ.818 కోట్లకు చేరుకున్నాయి. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్. ఐతే ఇంతకు మించి ‘కాంతార: చాప్టర్-1’ వసూళ్లు పెద్దగా పెరిగే అవకాం కనిపించడం లేదు. ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చనే అంచనాలు కలిగాయి కానీ.. అది సాధ్యం కాలేదు. ఈ చిత్రం మరి కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘కాంతార: చాప్టర్-1’ ఓవరాల్‌గా 2025 ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది కానీ.. ఓవర్సీస్‌లో మాత్రం ఇది లాస్ వెంచరే అయింది. ఈ సినిమా నార్త అమెరికాలో 7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేది. కానీ ఈ సినిమా అక్కడ 5 మిలియన్ల దగ్గర ఆగిపోయింది. ప్రిమియర్స్‌‌కు ఆశించిన స్పందన లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. తొలి వీకెండ్లో కూడా ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. సినిమాకు లాంగ్ రన్ ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ తగ్గడం మైనస్ అయి సినిమా అక్కడ లాస్ వెంచర్‌గా మిగిలింది.

Related Post

Most Disappointing Film of the century | Ek Deewane ki Deewaniyat Review 2025Most Disappointing Film of the century | Ek Deewane ki Deewaniyat Review 2025

Minutes to read: 4 minTeam IBO Rating User Rating [Total: 2 Average: 5] We’ve seen bad films that are bad due to reasons like poor plot, cringe dialogues, loud performances,

సుజ‌నా చౌద‌రిని చూసి నేర్చుకోవాల్సిందే.. !సుజ‌నా చౌద‌రిని చూసి నేర్చుకోవాల్సిందే.. !

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన నియోజకవర్గంలో చేపడుతున్న పనులను నిశితంగా పరిశీలించడంతోపాటు ఆయా పనులకు అవుతున్న ఖర్చులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న అవసరాలను