hyderabadupdates.com movies కారు ఎక్కనున్న కీలక కాంగ్రెస్ నేత?

కారు ఎక్కనున్న కీలక కాంగ్రెస్ నేత?

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే స‌మ‌యం ఆస‌న్న‌మైందా?  ఇప్ప‌టికే ఆయ‌న చేరిక‌కు సంబంధించి బీఆర్ ఎస్ అధిష్టానం మంత‌నాలు కూడా ముగించిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జీవ‌న్ రెడ్డి.. వైఎస్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశారు. అంతేకాదు.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే నాయ‌కుడిగా కూడాపేరు తెచ్చుకున్నారు. కానీ, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, పార్టీ రాష్ట్ర‌స్థాయి నాయ‌క‌త్వానికి.. జీవ‌న్ రెడ్డికి మ‌ధ్య దూరం పెరుగుతూ వ‌చ్చింది. ముఖ్యంగా 2023 త‌ర్వాత ఈ గ్యాప్ మ‌రింత పెరిగింది.

గ‌త ఎన్నిక‌ల్లోబీఆర్ ఎస్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న సంజ‌య్‌కుమార్‌ను రాష్ట్ర పార్టీ నాయ‌క‌త్వం కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో జీవ‌న్ రెడ్డి బాగా హ‌ర్ట్ అయ్యారు. త‌న‌ను సంప్ర‌దించ‌కుండానే.. క‌నీసం మాట మాత్రంగా అయినా చెప్ప‌కుండానే సంజ‌య్ ను చేర్చుకోవ‌డాన్ని ఆయ‌న ప‌లుసంద‌ర్భాల్లో త‌ప్పుబ‌ట్టారు. ఇక‌, పంచాయ‌తీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సంజ‌య్ చెప్పిన వారికే అవ‌కాశం ఇవ్వ‌డం.. త‌న వ‌ర్గం వారిని ప‌క్క‌న పెట్ట‌డం వంటివి కూడా జీవ‌న్ రెడ్డిని బాధించాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాలంలో త‌న మ‌నసులోని మాట‌ను ఆయ‌న బ‌య‌ట‌పెట్టేశారు.

“పార్టీలో ఉండాలో వ‌ద్దో తేల్చుకునే సమ‌యం వ‌చ్చేసింది“ అంటూ జీవ‌న్ రెడ్డి కొన్నాళ్ల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లు కూడా కాంగ్రెస్ లో చ‌ర్చ‌కు దారితీశాయి. అప్ప‌ట్లో రాష్ట్ర పార్టీ చీఫ్‌ మ‌హేష్‌కుమార్ గౌడ్ చ‌ర్చ‌లు జ‌రిపి కొంత వ‌ర‌కు ప‌రిస్థితిని స‌ర్దుబాటు చేసేలా వ్య‌వ‌హ‌రించారు. కానీ, జ‌గిత్యాల మునిసిపాలిటీ చైర్మ‌న్ సీటును త‌న వారికి ఇవ్వాల‌న్న జీవ‌న్ రెడ్డి అభ్య‌ర్థ‌న‌ను పార్టీ ప‌క్క‌న పెట్టింది. మ‌రోవైపు.. బీఆర్ఎస్ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యే సంజ‌య్‌కుమార్ దూకుడు రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవ‌ల ఆయ‌న జీవ‌న్ రెడ్డి వ‌ర్గాన్ని విమ‌ర్శించ‌డం కూడా వివాదానికి దారితీసింది.

ఈ ప‌రిణామాల‌ క్ర‌మంలోనే జీవ‌న్ రెడ్డి ఇక‌, పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నార‌న్న చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజాగా బీఆర్ ఎస్ పార్టీ కూడా ఆయ‌న‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో జీవ‌న్ రెడ్డి కారెక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. జ‌గిత్యాల‌లో వ్య‌క్తిగ‌తంగా జీవ‌న్ రెడ్డికి మంచి ఫాలోయింగే ఉంది. దీనికి తోడు బీఆర్ ఎస్‌కు కూడా..ఆద‌ర‌ణ ఉన్న క్ర‌మంలో త‌న‌కు లాభించే అవ‌కాశం ఉంటుంద‌ని జీవ‌న్ రెడ్డి అంచ‌నా వేసుకుని ఉంటారు. ఏదేమైనా.. జీవ‌న్ రెడ్డి ఇక‌, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్ప‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ పార్టీ ఎలారియాక్ట్ అవుతుంద‌న్న‌ది చూడాలి.

Related Post

నిన్న బాబు – నేడు పవన్!!నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ సూత్రం తెలుసుకున్న నేత సీఎం చంద్రబాబు నాయుడు. 23 స్థానాలు గెలిచినప్పుడైనా, 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పుడైనా ఆయన అదే

MM Keeravani’s Soulful Voice Shines in ‘Velledaarilo’ from Sri ChidambaramMM Keeravani’s Soulful Voice Shines in ‘Velledaarilo’ from Sri Chidambaram

Legendary music director MM Keeravani has lent his voice to a special song titled “Velledaarilo” from the upcoming Telugu film Sri Chidambaram, and the track is already receiving a warm