ఇటీవలే కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్ కి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరికినట్టు తన తెలుగు సినిమాని తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్లు ఇవ్వడం లేదని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద టాపిక్కే అయ్యింది. అతని ఆవేదనలో లాజిక్ ఉన్నా ఈ సమస్య ఇప్పటిది కాకపోవడంతో ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. కిరణ్ సదరు సినిమా టైటిల్ చెప్పకపోయినా తను అన్నది డ్యూడ్ గురించేనని అందరూ గుర్తు పట్టేశారు. కె ర్యాంప్ తో క్లాష్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చకు దారి తీశాయి.
తాజాగా జరిగిన డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ దీనికి బదులు ఇచ్చారు. మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఒకవేళ తమ డ్యూడ్ కన్నా అవతలి మూవీస్ ఇంకా బాగుంటే ఖచ్చితంగా తమ షోలు ఇవ్వడానికి, పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతే తప్ప నెంబర్ అఫ్ థియేటర్ల గురించి మాట్లాడ్డం సబబు కాదని అన్నారు. ఏపీ తెలంగాణతో పోల్చుకుంటే తమిళనాడులో థియేటర్లు తక్కువగా ఉండటం వల్ల సమస్య వస్తోంది తప్ప కావాలని చేసింది కాదని, హిట్టు ఇస్తే ఆటోమేటిక్ గా షోలు పెరుగుతాయని కుండబద్దలు కొట్టేశారు.
సో ఒక అగ్ర నిర్మాత నుంచి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా దీని గురించి ఎలాంటి విశ్లేషణలు వస్తాయో చూడాలి. వినడానికి బాగానే ఉంది కానీ ముందైతే మన హీరోలు పక్క రాష్ట్రంలో సాలిడ్ మార్కెట్ ఏర్పడాలంటే ఎలాంటి సినిమాలు తీయాలో డిసైడ్ అవ్వాలి. బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటివి అక్కడ ఆడాయి కానీ మీడియం బడ్జెట్ చిత్రాలు తమిళంలో పెర్ఫార్మ్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. అంతులేని కథలా ఈ థియేటర్ పంచాయితి ఎప్పటికీ తెగేది కాదు కాబట్టి ఫ్లోతో పాటు వెళ్లిపోవడం తప్ప ఎవరేం చేయలేరు. ఇంతకీ రవిశంకర్ అన్నట్టు దీపావళి విజేత ఎవరవుతారో చూడాలి.
Producer, #RaviShankar on screen-sharing controversy :“Make strong content and release it in other languages. That’s all that matters. Don’t complain about the number of theatres or blame others. If another film becomes a blockbuster, we’re ready to share our theatres too.” pic.twitter.com/cODGngBl5C— Gulte (@GulteOfficial) October 9, 2025