hyderabadupdates.com movies కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్లు పడ్డాక తనకిక తిరుగులేదని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కథ రివర్స్ అయ్యింది. ఒకదాన్ని మించి మరొకటి వరస డిజాస్టర్లతో తెలుగు నుంచి దూరమై తమిళంకు షిఫ్ట్ అయ్యింది. అక్కడా టైం కలిసి రావడం లేదు. సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అమ్మడు ఇబ్బందులు పడుతోంది. కార్తీతో నటించిన అన్నగారు వస్తారు మీద చాలా ఆశలు పెట్టుకుని ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొంది. నిర్మాత జ్ఞానవేల్ రాజా పరిష్కరించే పనిలో ఉన్నారు కానీ ఇప్పట్లో తెమిలేలా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి అంటున్నారు కానీ నో గ్యారెంటీ.

ఇదొక్కటే కాదు డిసెంబర్ 18 విడుదల కావాల్సిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సైతం పోస్టు పోన్ చేస్తున్నట్టు కొద్దిరోజుల క్రితమే వెల్లడయ్యింది. దర్శకుడు విగ్నేష్ శివన్ తో బడ్జెట్ పరంగా నిర్మాతతో వచ్చిన విభేదాలే దీనికి కారణమని చెన్నై టాక్. ప్రదీప్ రంగనాథన్ లాంటి క్రేజీ హీరో నటించిన మూవీ కావడంతో బిజినెస్ లో క్రేజ్ నెలకొంది. కానీ దాన్ని క్యాష్ చేసుకునే దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోవడం లేదు. ఈ లెక్కన ఒకే నెలలో వారం గ్యాప్ లో రిలీజ్ కావాల్సిన రెండు కృతి శెట్టి సినిమాలు ఆగిపోయాయి. కాకతాళీయంగా రెండింటి సమస్య ఒకటే కాగా సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్నవి కావడం గమనార్హం.

ఈ మొత్తం వ్యవహారంలో కృతి శెట్టి చేసేది ఏమీ లేకపోయినా దురదృష్టం వల్ల టైంకి రావాల్సిన సినిమాలు వాయిదాల పర్వంలో మునిగిపోయాయి. మన దగ్గర ఆమెను మర్చిపోయిన ప్రేక్షకులే ఎక్కువ. రష్మిక మందన్న, శ్రీలీలలాగా కనిపిస్తూ ఉంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో సారి దర్శనమిస్తే ఇలాగే అవుతుంది. తెలుగులో తను చేసిన గత సినిమాలు మనమే, కస్టడీ, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం మరీ దారుణంగా పోయాయి. మలయాళంలో ఏఆర్ఎం ఓ మోస్తరుగా ఆడింది. రవి మోహన్ తో చేసిన జీనీ కూడా రిలీజ్ పరంగా లేట్ అవుతోంది.

Related Post

కీర్తి సురేష్ ఈజ్ బ్యాక్కీర్తి సురేష్ ఈజ్ బ్యాక్

పరభాషా నటి అయినా అలాంటి ఫీలింగ్ ఏమీ కనిపించనివ్వకుండా.. మన వాళ్లు సొంత అమ్మాయిలా ఓన్ చేసుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ ఆరంభంలో ఆమె అందరు హీరోయిన్లలో ఒకరిలాగే కనిపించింది కానీ.. ‘మహానటి’ మూవీతో మొత్తం మారిపోయింది. సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన

లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!

ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు